GIRL WALKED DURING THE SLEEPING WITH THE GOLD WORTH MORE THAN 15 LAKH RUPEES AK
Sleep Walk: నిద్రలో నడుచుకుంటూ వెళ్లిన యువతి.. పోతూ పోతూ రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని కూడా..
ప్రతీకాత్మక చిత్రం
తెల్లవారుజామున 4 గంటల నుంచి కూతురు ఇంటి నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వాపోయారు. అయితే ఏడు గంటలకు కూతురు ఇంటికి తిరిగి రావడంతో దంపతులు పోలీసులకు సమాచారం అందించారు.
కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అసలు ఇలా కూడా జరుగుతందా ? అని అనిపిస్తుంటుంది. తాజా అలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మనస్తాపానికి గురై నిద్రాహారాలు మాని ఓ మహిళ రూ.15 లక్షల విలువైన బంగారాన్ని చెత్తకుప్పల్లో పడేసింది. తమిళనాడులోని కుందరత్తూరు మురుగన్ కోవిల్ రోడ్డులోని ఏటీఎం కౌంటర్లోని చెత్త కుండీలో ఆ మహిళ బంగారాన్ని గుర్తించారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఏటీఎం సెక్యూరిటీ అధికారికి సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బంగారు ఆభరణాలను కనుగొన్నారు. ఏటీఎం కౌంటర్లోని చెత్తకుప్పలో లెదర్ బ్యాగ్‌ను చూసి, తెరిచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కి సమాచారం అందించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఉదయం ఏటీఎం వద్దకు చేరుకున్న యువతి బ్యాగ్‌ని చెత్తకుండీలో వదిలేసినట్లు సీసీటీవీలో పరిశీలించగా కనిపించింది. అదే సమయంలో తమ 35 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూతురు ఇంటి నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వాపోయారు. అయితే ఏడు గంటలకు కూతురు ఇంటికి తిరిగి రావడంతో దంపతులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజీని దంపతులకు చూపించగా అదే యువతిగా గుర్తించారు. ఫుటేజీలో బంగారాన్ని డస్ట్‌బిన్‌లో వదిలేది తమ కూతురేనని దంపతులు పోలీసులకు చెప్పారు. తెల్లవారుజామున బంగారు ఆభరణాలతో కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న విషయం తల్లిదండ్రులకు తెలియలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటిని తనిఖీ చేయగా నగలు మాయమైనట్లు గుర్తించారు. తమ కుమార్తెకు నిద్రలో లేచే అలవాటు ఉందని, గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటోందని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో సమాచారం అందించకపోతే బంగారు ఆభరణాలు తిరిగి పొందడం కష్టమయ్యేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ నగలను దంపతులకు తిరిగి ఇచ్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.