Love Affair : యువకుడిపై యువతి యాసిడ్ దాడి..

తన చిన్న కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడి ఉండవచ్చునని అన్నారు. కొన్నాళ్లుగా పెళ్లి కోసం ఆమె ఫైజద్‌పై ఒత్తిడి తెస్తోందన్నారు.

news18-telugu
Updated: October 26, 2019, 1:55 PM IST
Love Affair : యువకుడిపై యువతి యాసిడ్ దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఉన్న జీవన్‌గఢ్‌లో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదన్న కారణంతో ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో గాయపడ్డ యువకుడిని ఫైజద్‌(20)గా పోలీసులు గుర్తించారు. గత ఆర్నెళ్లుగా వారిద్దరు ప్రేమలో ఉన్నారని.. నెల రోజుల నుంచి అతను ఆమెను పట్టించుకోవడం మానేశాడని.. ఈ నేపథ్యంలోనే ఆమె యాసిడ్ దాడికి పాల్పడిందని తెలిపారు. ఘటనపై సెక్షన్ 326A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఫైజద్‌ను దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పారు. యాసిడ్ దాడి అతని కళ్లపై తీవ్ర దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. ఘటనపై బాధితుడి తల్లి మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా ఆ యువతి ఫోన్ కాల్స్‌ను ఫైజద్ లిఫ్ట్ చేయట్లేదని తెలిపారు. తన చిన్న కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడి ఉండవచ్చునని అన్నారు. కొన్నాళ్లుగా పెళ్లి కోసం ఆమె ఫైజద్‌పై ఒత్తిడి తెస్తోందన్నారు. అయితే ఫైజద్ అందుకు ఒప్పుకోకపోవడంతో అతనిపై దాడికి పాల్పడిందన్నారు.

First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు