దారుణం.. కరోనా భయంతో బస్సులో నుంచి తోసేయ్యడంతో..

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అన్షిక యాదవ్ అనారోగ్యంతో కన్పించడాన్ని ప్రయాణికులు గమనించి.. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు అమ్మాయికి కరోనా ఉన్నట్టు కన్పిస్తోందని చెప్పారు.

news18-telugu
Updated: July 12, 2020, 8:27 AM IST
దారుణం.. కరోనా భయంతో బస్సులో నుంచి తోసేయ్యడంతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అత్యంత దారుణ ఘటనిది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు వీడడం లేదు. కరోనా వైరస్ పట్ల అవగాహన లేక కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వైరస్ భయంతో ఓ భార్య భర్తను నడిరోడ్డుపైనే వదిలేయగా, మరో ఘటనలో కన్నతల్లిని బస్టాండులో వదిలిపెట్టిపోయిన సందర్భం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయికి కరోనా సోకిందనే అనుమానంతో నడుస్తున్న బస్సు నుంచి ఆమెను కిందకు తోసేశారు. దీంతో ఆ అమ్మాయి తీవ్ర గాయాలపాలై.. ప్రాణం విడిచింది. ఈ ఘటనలో ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి షికోహాబాద్‌కు వెళ్లేందుకు అన్షిక యాదవ్(19) తన సోదరుడు విపిన్ యాదవ్, తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తుంది. అయితే అన్షిక యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అన్షిక యాదవ్ అనారోగ్యంతో కన్పించడాన్ని ప్రయాణికులు గమనించి.. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు అమ్మాయికి కరోనా ఉన్నట్టు కన్పిస్తోందని చెప్పారు.

దీంతో వారు అత్యుత్సాహంతో అమ్మాయి కప్పుకున్న దుప్పటిని విసిరేసి.. ఆమె కూర్చున్న సీటు నుంచి పక్కకు లాగేశారు. అమ్మాయికి కరోనా లేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నా వినకుండా.. బస్సు నుంచి బయటకు తోసేశారు. దీంతో అన్షిక యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు నుంచి తోసేసిన అరగంటకే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై అన్షిక యాదవ్ సోదరుడు విపిన్ యాదవ్ మాట్లాడుతూ.. తన సోదరికి కరోనా లక్షణాలు లేవని, కిడ్నీలో రాళ్లు రావడంతో బాధపడుతోందని తెలిపారు. అన్షిక యాదవ్‌ను బస్సు నుంచి తోసేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 8:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading