• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • GIRL STUDENT MOTHER ATTACK ON DRILL TEACHER FOR ABUSE PHONE CALLS AT GUNTUR SB

గుంటూరులో దారుణం... విద్యార్థి తల్లికి టీచర్ అసభ్య ఫోన్ కాల్స్

గుంటూరులో దారుణం... విద్యార్థి తల్లికి టీచర్ అసభ్య ఫోన్ కాల్స్

ప్రతీకాత్మక చిత్రం

తన కూతురుకు ట్రైనింగ్ ఇస్తుండటంతో ఆ టీచ‌ర్‌‌తో విద్యార్థిని తల్లికి కాస్త పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే... కొంచెం చనువుగా మాట్లాడింది.

  • Share this:
    గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.  విద్యార్థిని తల్లిని వేధింపులకు గురి చేశాడో ఓ ఉపాధ్యాయుడు. అసభ్య పదజాలతో మాట్లాడి లైంగిక వేధింపులకు గురి చేశాడు.  ఆ తర్వాత ఆ తల్లితో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా కారంపూడిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.... కారంపూడిలో ప్రైవేట్ పాఠశాలలో సుభానీ అనే వ్యక్తి డ్రిల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలికకు ఇతడు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాడు. దీంతో తన కూతురుకు ట్రైనింగ్ ఇస్తుండటంతో ఆ టీచ‌ర్‌‌తో విద్యార్థిని తల్లికి కాస్త పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే... కొంచెం చనువుగా మాట్లాడింది. ఆ చనువును అలుసుగా తీసుకున్న ఆ కీచక టీచర్ బాలిక తల్లి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు తరచూ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడేవాడు.

    దీంతో ఆమె చాలా సార్లు అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇలా మాట్లాడటం సరికాదని చెప్పింది. స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించింది. అయినా కూడా అతడి బుద్ధి మారలేదు. దీంతో ఆగ్రహంతో భర్త, మరికొందరు బంధువులతో కలిసి స్కూల్ వద్దకు వచ్చింది.  టీచర్ సుభానికి ప్రశ్నిస్తుండగా... సదరు మహిళ ఉపాధ్యాయుడిపై చెప్పు దెబ్బలు కొట్టింది. అక్కడ్నుంచి వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈఓ వీరయ్య చౌదరి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం అతనిని విధుల నుంచి తొలగించిందన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తామన్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: