హోమ్ /వార్తలు /క్రైమ్ /

TS news : టీచర్ కొట్టడడంతో విద్యార్థినికి పక్షవాతం.. హోంవర్కు చేయనందుకేనంటూ తల్లి ఫిర్యాదు.. !

TS news : టీచర్ కొట్టడడంతో విద్యార్థినికి పక్షవాతం.. హోంవర్కు చేయనందుకేనంటూ తల్లి ఫిర్యాదు.. !

TS  news : టీచర్ కొట్టడడంతో విద్యార్థినికి పక్షవాతం..

TS news : టీచర్ కొట్టడడంతో విద్యార్థినికి పక్షవాతం..

TS news : ఇచ్చిన హోంవర్కు చేయకపోవడంతో ఆ స్కూళు హెడ్మాస్టర్ ఓ బాలికను చెంపపై కొట్టాడు.. అయితే ఆ దెబ్బ బలంగా తాకడంతో బాలిక వెళ్లి క్లాసులోని గోడకు తాకింది. దీంతో తల బలంగా డీకొట్టింది. అయితే అప్పుడు బాగానే ఉన్నా రెండు రోజుల తర్వాత పక్షవాతానికి గురైంది.

ఇంకా చదవండి ...


గత రెండు సంవత్సరాలుగా స్కూళ్లే లేవు.. కాని కొద్ది రోజుల క్రితమే.. కరోనా కేసులు తగ్గడంతో తిరిగి స్కూళ్లను (schools)ప్రారంభించారు. అయితే ఇంతలోనే విద్యార్థులపై స్కూళు యాజమాన్యాలు, టీచర్ల వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో ఓ సంఘటనలో ఓ విద్యార్థినికి పక్షవాతం వచ్చిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem )జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ప్రాథమిక ఠశాల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాల్యాతండాకు చెందిన దారావత్‌ రమేశ్‌-రోజా దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె స్నేహిత పడమట నర్సాపురం (Narsapuram)ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 18న తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టులకు సంబంధించి హోమ్‌వర్క్‌ చేయలేదని స్నేహితను ప్రధానోపాధ్యాయుడు బాణోత్‌ శంకర్‌ కొట్టారు. దీంతో బాలిక స్పీడుగా వెళ్లి గోడకు తగిలి కింద పడిపోయింది. దీంతో ఆమె స్కూలు నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె నీరసంగా ఉండటంతో తల్లి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఈనెల 20న బడికి వెళ్లమంటే వెళ్లకుండా ఇంటి సమీపంలోని రహదారి పక్కన కూర్చుండిపోయింది. బడికెందుకు వెళ్లడం లేదని తల్లి ప్రశ్నించగా తలనొప్పిగా ఉందని చెప్పింది.

ఇది చదవండి : పెళ్లైన నెలకే భార్యపై అనుమానం..కట్ చేస్తే... భార్యభర్తలు విగతజీవులయ్యారు... !


ఇక ఆ మరుసటి రోజు బాలిక చెయ్యి, మూతి వంకరపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి(hospital) వద్దకు, అక్కడి నుంచి ఖమ్మంలోని(khammam) ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు (doctors)ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయగా తలలో దెబ్బతగలడంతో పక్షవాతం వచ్చిందని తేలింది. ఎవరైనా తలపై కొట్టారా అని స్నేహితను వైద్యుడు ప్రశ్నించడంతో హోమ్‌వర్క్‌ చేయలేదని ప్రధానోపాధ్యాయుడు కొట్టారని, ఎవరితో చెప్పొద్దని ఆయన బెదిరించడంతో తల్లికి కూడా చెప్పలేదని వెల్లడించింది.

ఇది తెలుసుకున్న తల్లితండ్రుడు వెంటనే స్కూలుకు వెళ్లి కూతురిని ఎందుకు కొట్టారని తల్లి ప్రశ్నించారు. అయితే ఆ ప్రధానోపాధ్యాయుడు తాను కొట్టలేదని చెప్పాడు.. పైగా ఈ విషయంపై దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన కూతురును కొట్టిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇది చదవండి : కూతురిపై తండ్రి లైంగిక దాడి.. ప్రతిఘటించిన కూతురు.. పెద్ద సహసమే చేసింది...!


కాగా ఈ విషయం కాస్త జిల్లా డీఈఓకు(DEO) చేరింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక ఎంఈవోను ఆదేశించారు. విచరణ కోసం వెళ్లిన ఎంఈవోకు సైతం ప్రధానోపాద్యాయుడు అదే సమాధానం ఇచ్చాడు. అసలు ఆ సమయంలో తాను స్కూళ్లోనే లేనని చెప్పాడు. తన కూతురు కూడా ఈ స్కూళ్లోనే చదువుతుందని అలాంటిది తాను పిల్లలను హింసిస్తానని చెప్పాడు. విద్యార్థి స్నేహిత ఆడుకుంటూ వెళ్లి గోడకు తగిలిందని తోటి విద్యార్థులు చెప్పారని వివరణ ఇచ్చాడు.. అయితే పూర్తి నివేదికను ఎంఈవో ఇచ్చిన తర్వాతే స్కూళ్లో ఏం జరిగిందనే విషయం వెలుగు చూడనుంది.

First published:

Tags: Khammam, School girl, Telangana