తలనొప్పిగా ఉందని పడుకుంది... నిద్ర లేచేసరికి ఏడు నెలల గర్భం...

ఇంగ్లండ్‌లో విచిత్ర సంఘటన... యుట్రేనస్ డిడిల్‌పీస్ అనే విచిత్రమైన వ్యాధికి గురైన టీనేజ్ అమ్మాయి... కోమాలోంచి బయటికి వచ్చేసరికి బిడ్డకు జననం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 10, 2019, 3:53 AM IST
తలనొప్పిగా ఉందని పడుకుంది... నిద్ర లేచేసరికి ఏడు నెలల గర్భం...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 10, 2019, 3:53 AM IST
ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్లిన ఓ 18 ఏళ్ల అమ్మాయి... అందులోంచి బయటికి వచ్చేసరికి గర్భం దాల్చినట్టుగా గుర్తించి షాక్‌కు గురైంది. అలాగని ఆమె నెలలపాటు కోమాలో ఉండిందీ లేదు. తర్వాతి రోజే కోమా నుంచి బయటికి వచ్చింది. అప్పుడే, అంతలోనే అలా ఎలా సాధ్యమైందో తెలియక ఆందోళనకు గురైంది. ఇంగ్లండ్‌లోని ఓల్దామ్ సిటీకి చెందిన ఏబోనీ స్టీవెన్‌సన్... తలనొప్పిగా ఉందని తన బెడ్‌రూమ్‌లో పడుకుంది. లేచి చూసేసరికి ఓ పెద్ద ఆసుపత్రిలో ఉంది... ఎక్కడున్నానని ఆలోచించేలోపే... తన కడుపును చూసి ఆశ్చర్యపోయింది. తాను ఏడు నెలల గర్భవతిని అని అర్థమై... అసలేమైందో తెలియక పిచ్చెక్కినంత పనైంది. అలాగని ఆమెపై ఎటువంటి అత్యాచారం, లైంగిక దాడి జరగలేదు.

కొన్ని నెలల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శృంగారంలో పాల్గొంది ఏబోనీ. అయితే ఆ తర్వాత కూడా ఆమె నెలసరి సరిగ్గా క్రమం తప్పకుండా రావడంతో గర్బం దాల్చిన విషయం గుర్తించలేదు. అదీ గాక యుట్రేనస్ డిడిల్‌పీస్ అనే వింత వ్యాధికి గురైన ఏబోనీకు రెండు గర్భసంచులు ఉన్నాయి. దాంతో ఒక గర్భసంచిలో బిడ్డ ఉండడంతో, మరో గర్భాశయం నుంచి రుతుక్రమం రాసాగింది. బిడ్డ ఉన్న గర్భసంచి, వెన్నుపూసకి వెనకాల ఉండడంతో పొట్ట సైజు కూడా పెద్దది కాలేదు. దీని వల్ల ఆమె ఏడో నెల వచ్చినా గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించలేకపోయింది. ఉన్నట్టుండి 18 ఏళ్ల అమ్మాయికి తీవ్రమైన తలనొప్పి రావడం, ఆ వెంటనే ఆమె కోమాలోకి జారుకోవడానికి కూడా ఇదే కారణమని తేల్చారు వైద్యులు. ఎట్టకేలకు బిడ్డను ఆరోగ్యంగా బయటికి తీయగలిగారు డాక్టర్లు. ఫిజియోథెరపీ చదువుతున్న ఏబోనీ... 18 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని తెలపడం కొసమెరుపు. గత ఏడాది ఇంగ్లండ్‌లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగుచూసింది.

First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...