బావిలోంచి అరుపులు.. ఏంటా అని చూస్తే లోపల ఓ యువతి, ఓ యువకుడు.. అసలేం జరిగిందంటే..

బావిలోంచి యువతీ యువకులను కాపాడుతున్న స్థానికులు ( Photo Courtesy: Twitter )

బావి దగ్గరకు వెళ్లి లోపలకు తొంగి చూస్తే ఓ యువకుడు, మరో యువతి కనిపించారు. కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నారు. పోలీసులు వచ్చి వారిని ఎలాగోలా కాపాడారు. అసలేం జరిగింది.? అందులో ఎలా పడ్డారు? అని పోలీసులు అడిగితే ఆ యువకుడు నోరు విప్పాడు.

 • Share this:
  రోడ్డు పక్కన ఓ బావి. అందులోంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఏంటా అని అటుగా వెళ్తున్న వారికి అనుమానం వచ్చింది. బావి దగ్గరకు వెళ్లి లోపలకు తొంగి చూస్తే ఓ యువకుడు, మరో యువతి కనిపించారు. కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారిని ఎలాగోలా కాపాడారు. అసలేం జరిగింది.? అందులో ఎలా పడ్డారు? అని పోలీసులు అడిగితే ఆ యువకుడు నోరు విప్పాడు. అతడు చెప్పింది విని అంతా అవాక్కయ్యారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ తరం యువత సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో లైక్స్, షేర్ల కోసం కామెంట్ల కోసం వెరైటీ వెరైటీ సాహస కృత్యాలకు దిగుతున్నారు. రిస్కీ ఫీట్లు చేస్తున్నారు.

  ఇక సెల్ఫీల మోజు గురించి అయితే వేరుగా చెప్పనవసరం లేదు. సముద్రంలోకి వెళ్లి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొండలు, గుట్టలు ఎక్కి మరీ ఫొటో క్లిక్స్ కోసం రిస్క్ తీసుకుంటున్నారు. బైక్ లపై రయ్యిమంటూ వెళ్తూ వెనకనుంచి మిత్రులతో వీడియోలు తీయించుకుంటున్నారు. రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. చివరకు శవాలతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టుకుని వైరల్ చేస్తున్నారు. నెట్టింట లైకులు, షేర్లు, కామెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది.
  ఇది కూడా చదవండి: దుబాయిలో భారత్ యువకుడిని మసాజ్ అంటూ ఓ అమ్మాయి అపార్ట్మెంట్ కు రప్పించి.. ఏకంగా నలుగురు యువతుల ఘోరమిది..!

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఓ యువతి బావి దగ్గర సెల్ఫీ దిగాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అనుకోకుండా 85 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఆమె అరుపులు విని అటుగా వెళ్తున్న యువకుడు ఆ బావి వద్దకు వెళ్లి చూశాడు. ఆమెను కాపాడాలని బావిలోకి దూకాడు. ఆమెను అయితే కాపాడాడు కానీ, ఆ బావిలోంచి బయటకు వచ్చే మార్గం మాత్రం లేకుండా పోయింది. దీంతో వాళ్లిద్దరూ కాపాడండి.. కాపాడండి, అంటూ కేకలు వేయసాగారు. దీంతో ఆ బావి మీదుగా వెళ్తున్న కొందరు స్థానికులు వారి కేకలు విన్నారు. ఆత్మహత్యాయత్నమేమోనని భావించి బావిలో ఓ యువతీ యువకుడు ఉన్నారన్న సంగతి గురించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వచ్చి స్థానికుల సాయంతో బావిలోంచి వారిని బయటకు తీశారు. అసలేం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే ఆ యువకుడు నోరు విప్పాడు. ఆ యువతి నిర్వాకం గురించి చెప్పాడు. దీంతో పోలీసులు ఆమెను మందలించి పంపించి వేశారు.
  Published by:Hasaan Kandula
  First published: