ఏపీలో దారుణం.. యువతిని రేప్ చేసి.. ఆ వీడియో తీసి..

Crime News: గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యువతి చదువుతోంది. యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఈ మధ్యే ఆమెను బైక్ ఎక్కించుకొని బయటికి తీసుకెళ్లాడు.

news18-telugu
Updated: August 14, 2019, 8:46 PM IST
ఏపీలో దారుణం.. యువతిని రేప్ చేసి.. ఆ వీడియో తీసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్నేహం ముసుగులో ఓ యువకుడు తన స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడిని పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెపై దారుణానికి తెగబడ్డారు. పైగా, ఈ దారుణాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యువతి చదువుతోంది. యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఈ మధ్యే ఆమెను బైక్ ఎక్కించుకొని బయటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో అతడు మరో స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడికి రప్పించుకొని ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని ఇద్దరూ వీడియో తీశారు.

అనంతరం ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఈ తర్వాత యువతిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో యువతి అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వాళ్లు గుంటూరు అర్బన్‌లోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు