ఆన్‌లైన్ క్లాసు పేరిట పోర్న్‌కు అలవాటు పడి...బాలికపై టీనేజీ కుర్రాళ్ల దురాగతం..

పోర్న్ సినిమాలు విపరీతంగా చూసిన ఆ ముగ్గురు యువకుల ఆలోచనలు పెడమార్గం పడ్డాయి. తమ ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఓ మైనర్ బాలికపై వారి కన్ను పడింది.

news18-telugu
Updated: August 3, 2020, 12:12 AM IST
ఆన్‌లైన్ క్లాసు పేరిట పోర్న్‌కు అలవాటు పడి...బాలికపై టీనేజీ కుర్రాళ్ల దురాగతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆన్ లైన్ క్లాసుల పేరిట కొందరు యువకులు మొబైల్ ఫోన్లను పెడమార్గం పట్టిస్తున్నారు. క్లాస్ రూం పాఠాలు వింటున్నామని తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి పోర్న్ సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు. అంతటితో ఆగలేదు...ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి కూడా దిగడంతో కలకలం రేగుతోంది. వివరాల్లోకి వెళితే డెహ్రాడూన్ లోని సుహాస్ పూర్ లో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలురు ఆన్ లైన్ క్లాసుల పేరిట పోర్న్ సినిమాలు చూడటం స్టార్ట్ చేశారు. అయితే పోర్న్ సినిమాలు విపరీతంగా చూసిన ఆ ముగ్గురు యువకుల ఆలోచనలు పెడమార్గం పడ్డాయి. తమ ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఓ మైనర్ బాలిక(14)పై వారి కన్ను పడింది. ముగ్గురుకలిసి బాలికను వాళ్ల తల్లి పిలుస్తోందని, తమ ఇంట్లో ఉందని నమ్మించారు. ఆ బాలిక అమాయకంగా ఇంట్లోకి వెళ్లగానే, ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు.

దీంతో ఆ బాలిక గట్టిగా అరవడంతో, చుట్టు పక్కల ఉన్న వారు తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. ముగ్గురు మైనర్ బాలురు చేస్తున్న పనికి షాక్ తిన్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తాము రెండు రోజులు వరుసగా ఫోన్‌లో పోర్న్ సినిమా చూసినట్టు నిందితుల్లో ఒకడైన బాలుడు చెప్పాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ప్లాన్ చేసినట్టు చెప్పాడు. నిందితులపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 12:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading