ఫేస్‌బుక్ స్నేహితుడి మాటలు నమ్మి వచ్చిన యువతిపై...గ్యాంగ్ రేప్...

యువతి సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి నవీన్‌తో ఛాటింగ్ చేస్తోంది. అయితే ఒకసారి కలుద్దామని యువతితో నవీన్ చెప్పడంతో ఆమె అక్కడకు ఏకాంతంగా వెళ్లింది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన నవీన్… తన ముగ్గురు స్నేహితులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: January 20, 2020, 9:07 PM IST
ఫేస్‌బుక్ స్నేహితుడి మాటలు నమ్మి వచ్చిన యువతిపై...గ్యాంగ్ రేప్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియా పరిచయం ఓ యువతి జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తహర్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్(పేరు మార్పు)తో బాధిత యువతి సోనం (పేరు మార్పు) సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. యువతి సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి నవీన్‌తో ఛాటింగ్ చేస్తోంది. అయితే ఒకసారి కలుద్దామని యువతితో నవీన్ చెప్పడంతో ఆమె అక్కడకు ఏకాంతంగా వెళ్లింది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన నవీన్… తన ముగ్గురు స్నేహితులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాదు బయట ఎవరి కైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే యువతి అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విచారణ కొనసాగుతోంది.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు