మూగ బాలిక అనే కనికరం లేకుండా...మరోసారి చెలరేగిన కామాంధులు...

బాలిక ఎప్పటి లాగే స్థానికంగా ఉన్న ఓ దుకాణ సముదాయంలో సరుకులు కొనేందుకు వెళ్లగా, దారి కాచిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి, వాహనంలోకి ఎక్కించారు. అంతేకాదు ఆమెపై అమానుషంగా అత్యాచారానికి యత్నించారు.

news18-telugu
Updated: January 16, 2020, 9:42 AM IST
మూగ బాలిక అనే కనికరం లేకుండా...మరోసారి చెలరేగిన కామాంధులు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూగ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రేవా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే బాలిక ఎప్పటి లాగే స్థానికంగా ఉన్న ఓ దుకాణ సముదాయంలో సరుకులు కొనేందుకు వెళ్లగా, దారి కాచిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి, వాహనంలోకి ఎక్కించారు. అంతేకాదు ఆమెపై అమానుషంగా అత్యాచారానికి యత్నించారు. దీంతో అక్కడి నుంచి పారిపోయిన యువతి ఇంటికి వెళ్లి, తమ కుటుంబ సభ్యులతో తన గోడును వెళ్లబుచ్చింది.

కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులతో సహా ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>