మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..అవమానం తట్టుకోలేక...

మార్గ మధ్యంలో మద్యం మత్తులో ఉన్న మృగాళ్లు వారిని అడ్డగించి ఆమె బాయ్ ఫ్రెండ్ ను చితకబాదారు. అతని వద్ద ఉన్న మొబైల్‌, ఇతర వస్తువులను లాక్కున్నారు. అనంతరం బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: July 1, 2020, 10:02 PM IST
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..అవమానం తట్టుకోలేక...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మైనర్ బాలిక అనే కనికరం లేకుండా కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన బీహార్ లోని చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెల్తే…ఓ 16 ఏళ్ల యువతి.. ఓ యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ బాలిక గత వారం రాత్రి సమయంలో సొంత గ్రామానికి యువకుడితో కలిసి బైక్‌పై బయల్దేరారు. మార్గ మధ్యంలో మద్యం మత్తులో ఉన్న మృగాళ్లు వారిని అడ్డగించి ఆమె బాయ్ ఫ్రెండ్ ను చితకబాదారు. అతని వద్ద ఉన్న మొబైల్‌, ఇతర వస్తువులను లాక్కున్నారు. అనంతరం బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ రాత్రంతా బాలికపైపై అత్యాచారం చేసిన కామాంధులు వేకువజామున 4 గంటల సమయంలో ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. అఘాయిత్యం జరిగిన తర్వాత సొంతూరుకు వెళ్లిన బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే కుటుంబ సభ్యులు అడ్డుకొని జరిగిన విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.
First published: July 1, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading