మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...

నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా మత్తులోకి జారుకుంది. వెంటనే భూపేందర్ ఆమెను బెడ్రూంలోకి ఎత్తుకెళ్లి తన పశువాంఛను తీర్చుకున్నాడు.

news18-telugu
Updated: September 21, 2019, 8:30 PM IST
మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
స్నేహితుడని నమ్మి ఇంటికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురుదాస్ పూర్ లో చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే బాధితురాలు మోనా (పేరు మార్పు) స్థానిక కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే అదే కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న దీపక్ మిశ్రా (పేరు మార్పు)తో బాధితురాలు కాస్త చనువుగా ఉండేది. ఆ చనువే ఇద్దరి మధ్య స్నేహం చిగురించేలా చేసింది. ఇద్దరూ కళాశాల లోపల బయట చాలా స్నేహంగా ఉండేవారు. అయితే దీపక్ లో మాత్రం రాను రాను మార్పులు రావడం ప్రారంభమైంది. అతడు డ్రగ్స్ కు బానిస కావడం మొదలు పెట్టాడు. తమ కాలేజీ సమీపంలో డ్రగ్ మాఫియాతో బంధం ఏర్పడింది. వారితో సహవాసం కారణంగా డ్రగ్స్ అలవాటు అయ్యాయి. ఇంట్లో పెద్దలకు తెలియకుండా దీపక్ డబ్బులు మాయం చేసి డ్రగ్స్ కొనేవాడు. అయితే ఈ క్రమంలోనే డ్రగ్ సప్లయర్స్ లో ఒకడైన భూపేందర్, మోనాపై కన్నేశాడు. అందుకోసం దీపక్ తో ఒప్పందం కుదుర్చుకొని, తనకు మోనాను అప్పగిస్తే డ్రగ్స్ ఉచితంగా ఇస్తానని నమ్మించాడు. డ్రగ్స్ మాయలో పడిన దీపక్, తన స్నేహితురాలు మోనా శీలాన్ని తాకట్టు పెట్టేశాడు.

ఒక రోజు మోనాకు ఫోన్ చేసిన దీపక్ వెంటనే ఆమెను, తన ఇంటికి రావాలని ఆరోగ్యం బాలేదని ఫోన్ చేశాడు. ఇది నమ్మిన మోనా పరుగున దీపక్ ఇంటికి వచ్చింది. దీపక్ పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మోనాను పిలిచాడు. అంతేకాదు భూపేందర్ సైతం అదే సమయంలో ఇంట్లో ఉన్నాడు. నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా మత్తులోకి జారుకుంది. వెంటనే భూపేందర్ ఆమెను బెడ్రూంలోకి ఎత్తుకెళ్లి తన పశువాంఛను తీర్చుకున్నాడు. మత్తు నుంచి బయట పడిన మోనా విషయం తెలుసుకొని భోరున విలపించింది. తన జీవితాన్ని పాడుచేసిన దీపక్, భూపేందర్ లపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading