Home /News /crime /

GIRL KILLED BY WILD BOAR IN BADRADRI KOTTAGUDEM DISTRICT BN

అడవిపంది దాడిలో బాలిక మృతి.. అటవీశాఖ కీలక నిర్ణయం..

నల్లమల అడవి

నల్లమల అడవి

ఇప్పపువ్వు కోసం అడవికి వెళ్లిన సమయంలో అడవి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన గ్రామస్తులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.

    అడవిపంది దాడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక మ‌ృతిచెందిన ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చర్ల మండలం పూసుకుప్ప గ్రామానికి చెందిన పొడి కవిత ఇప్పపువ్వు కోసం అడవికి వెళ్లింది. ఆ సమయంలో అడవి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన గ్రామస్తులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. బాలిక మృతిపట్ల అటవీశాఖ సంతాపాన్ని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ తెలుసుకున్నారు. గురువారం అటవీశాఖ తరపున బాలిక కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారం కింద రూ.5లక్షలను అందించాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేవారు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవుల లోపలికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీఎఫ్ కోరారు. జంతువుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠంగా కొనసాగించాలని అటవీ ప్రాంతాల జిల్లాల అధికారులను సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Badradri, Forest, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు