తన ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందని ఏకంగా కన్న తల్లినే కడతేర్చింది ఓ కసాయి కూతురు. కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి మందలించిందనే కోపంతో తల్లిని చంపింది హయత్ నగర్ పరిధిలోని మునగనూర్కు చెందిన కీర్తీ రెడ్డి. మూడూ రోజుల పాటు ఎవరికీ తెలియకుండా తల్లి రజిత మృతదేహాన్ని ఇంట్లోనే దాచింది. అయితే మృతదేహం దుర్వాసన వస్తే అందరికీ తెలిసిపోతుందని భావించిన కీర్తీ రెడ్డి, ఆమె ప్రియుడు కలిసి... రజిత మృతదేహాన్ని నల్లగొండ జిల్లా రామన్నపేట దగ్గర రైల్వే ట్రాక్ వద్ద పడేసి వచ్చారు. అనంతరం తన ప్రియుడితో కీర్తి షికార్లు చేసింది.
ఇంటికొచ్చిన కూతురును తల్లి ఎక్కడని నిలదీసిన తండ్రితో తనకు ఏమీ తెలియదని చెప్పింది కీర్తీ రెడ్డి. అంతేకాదు ఏకంగా తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని చంపినట్టు కీర్తీ రెడ్డి అంగీకరించడంతో... పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారం కోసం ఏకంగా కన్నతల్లినే కీర్తీ రెడ్డి చంపిన వైనం సంచలనంగా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.