యువతిపై గ్యాంగ్ రేప్... ఆ ఐదుగురికీ ఉంటుందీ...

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలో అదేం దరిద్రమోగానీ... రేపిస్టులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిర్భయ కేసులో దోషుల్ని ఉరి తీస్తేనైనా ఈ దారుణాలకు బ్రేక్ పడుతుందా?

  • Share this:
    ఇండియాలో మహిళలపై ఎక్కువగా దారుణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తరచూ వినిపిస్తోంది. తాజాగా అక్కడి నోయిడాలో... సెక్టార్ 51లో శుక్రవారం జరిగిందీ దారుణం. ఓ యువతిపై ఐదుగురు నిందితులు కాట్లకుక్కల్లా ఎగబడ్డారు. గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత దుండగులు పారిపోగా... తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడివున్న ఆ యువతిని స్థానికులు గుర్తించి, ఆశ్రయమిచ్చారు. తర్వాత విషయం పోలీసులకు తెలిసింది. నిందితుల్లో ముగ్గురి పేర్లను యువతి పోలీసులకు చెప్పింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు... నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐతే... ఆస్పత్రిలో ఇంటరాగేషన్‌లో పోలీసులకు యువతి చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఆ దుర్మార్గులు ఆమెను... గౌతం బుద్ధ నగర్ ఏరియాలో గ్యాంగ్ రేప్ చేసి... ఆమెను... సెంట్రల్ విహార్ ఏరియాలో విసిరేసినట్లు చెప్పింది.

    తెలంగాణలో దిశ కేసులో లాగే ఇక్కడా జరిగింది. ఘటన జరిగింది ఓ పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో... కంప్లైంట్ ఇచ్చింది మరో పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో. అయినప్పటికీ పోలీసులు అదేమీ పట్టించుకోకుండా... జీరో FIR నమోదు చేసి, యువతి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే యూపీలో ఇలాంటి రేప్ ఘటనలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు, ప్రభుత్వంపై విమర్శలూ ఉన్నాయి. ఈ కేసులో వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


    Published by:Krishna Kumar N
    First published: