GIRL GANG RAPED BY FOUR IN CHHATTISGARH ACCUSED HELD PVN
Shocking : మరో నిర్భయ ఘటన..మహిళపై సామూహిక అత్యాచారం..ఆపై ఆమెను దారుణంగా
ప్రతీకాత్మక చిత్రం
Girl gang raped : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా... మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
Girl gang raped : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా... మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో ఉన్నా కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. అయినావారే అమ్మాయిలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. పలు చోట్ల కన్న తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటనల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ తరహా ఘటన ఛత్తీస్‌గఢ్( Chhattisgarh) లోవెలుగుచూసింది.
ఛత్తీస్‌గఢ్ లో ని సుర్గుజా అడవుల్లో ఓ యువతిపై నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. అదే సమయంలో ఆమె భాగస్వామిపై కూడా దాడి చేశారు. ఆమెను, ఆమె భాగస్వామిని దారుణంగా కొట్టారు ఆ నలుగురు నిందితులు. ఆ తర్వాత బాధితురాలి బ్యాగులో ఉంచిన డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సుర్గుజా పోలీసులు సమీప గ్రామాలపై దాడులు చేశారు.
అదే సమయంలో పోలీసులను చూసిన ఓ అనుమానితుడు భయాందోళనకు గురయ్యాడు. బాధితురాలు అతడిని గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేవలం రెండు గంటల్లోనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ ఉన్నాడు. మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడిగా సంతోష్ యాదవ్, మిగతా వారిని అభిషేక్ యాదవ్, నాగేంద్ర యాదవ్‌గా పోలీసులు గుర్తించారు.
మరోవైపు,జార్ఖండ్‌లో ఓ గిరిజన విద్యార్దినిపై యువకుడు దాడి చేసిన వార్త కలకలం రేపుతోంది. స్కూల్‌కి వెళ్లి వస్తున్న అమ్మాయిని యువకుడు తంతుంటే అతని స్నేహితులు వీడియో తీశారు. ఇప్పుడు ఈవీడియో సీఎంకు చేరడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్కూల్‌లో చదువుతున్న ఓ గిరిజన బాలిక(Tribal student)ని ఓ యువకుడు అత్యంత దారుణంగా కాళ్లతో తంతూ చేతులతో కొట్టాడు. స్కూల్ యూనిఫామ్(School uniform)లో ఉన్న గిరిజన అమ్మాయిని యువకుడు కొడుతుంటే అతని స్నేహితులు వీడియో(Video) తీస్తూ శునకానందం పొందారు. అంతటితో ఆగకుండా ఆ వీడియో(Video)ని ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేసుకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.