మసాజ్ పార్లర్లో నగ్నంగా ఉన్న యువతికి...రహస్య కెమెరా కంటపడి...ఏం జరిగిందంటే...?

అవాంఛిత రోమాలు తీసిన తర్వాత, అంతా శుభ్రం చేసి మసాజ్ మొదలు పెడతామన్నారు. అందుకోసం పూర్తిగా నగ్నంగా మారి బెడ్ పై పడుకోవాలని కోరారు. అయితే అలా చేస్తే తనకు ఇబ్బందిగా ఉంటుందని, లోదుస్తులు ధరించి ఉండగా, మసాజ్ చేయాలని కోరింది. అందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అన్నది.

news18-telugu
Updated: July 1, 2019, 9:09 PM IST
మసాజ్ పార్లర్లో నగ్నంగా ఉన్న యువతికి...రహస్య కెమెరా కంటపడి...ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శరీర అలసటను దూరం చేసే మసాజ్ పార్లర్ చివరకు రహస్య వీడియోలు తీసే కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసే కేంద్రంగా మారింది. వివరాల్లోకి వెళితే మలేషియాలోని ఓ మసాజ్ పార్లర్ లో బాధిత యువతి బాడీ మసాజ్, అలాగే అవాంఛిత రోమాలు తీయించుకునేందుకు వెళ్లింది. అక్కడి సిబ్బంది మొత్తం యువతులే కావడంతో ఆ యువతి భయపడకుండా వెళ్లింది. మసాజ్ రూంలోకి వెళ్లిన తర్వాత తన శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తీయాలని కోరగా, ముుందుగా దుస్తులను తొలగించి కేవలం ఇన్నర్ వేర్ తో ఉండాలని సిబ్బంది చెప్పగా, యువతి అమాయకంగా తన దుస్తులను తీసివేసి కేవలం లోదుస్తులతో బెడ్ మీద పడుకొని ఉంది. అయితే అక్కడి సిబ్బంది ప్రవర్తన మాత్రం కాస్త విచిత్రంగా కనిపించింది. అయినప్పటికీ వారంతా యువతులే కావడంతో అనవసరంగా అనుమానం పడటం ఎందుకని ఆ యువతి భ్రమించింది.

ఇంతలో అవాంఛిత రోమాలు తీసిన తర్వాత, అంతా శుభ్రం చేసి మసాజ్ మొదలు పెడతామన్నారు. అందుకోసం పూర్తిగా నగ్నంగా మారి బెడ్ పై పడుకోవాలని కోరారు. అయితే అలా చేస్తే తనకు ఇబ్బందిగా ఉంటుందని, లోదుస్తులు ధరించి ఉండగా, మసాజ్ చేయాలని కోరింది. అందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అన్నది. అయితే యువతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా నగ్నంగా మారే అవకాశమే లేదని మొండికేసింది. దీంతో అక్కడి సిబ్బంది ఆ యువతిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. చివరకు ఆ యువతిని ఒప్పించింది. కానీ గతంలో పలు మసాజ్ పార్లర్లలలో దుస్తులు పూర్తిగా విడిచేయమని బలవంతపెట్టిన సందర్భంగా లేదని యువతి గుర్తుకుతెచ్చుకుంది. ఇంతలో బాధిత యువతి తల ఎత్తి సీలింగ్ వైపు చూడగా, అక్కడ ఫైర్ అలారం వైపు అనుమానంగా చూసింది. తదేకంగా చూడగా, అందులో కెమెరా ఉందేమోనని యువతి అనుమానించింది. ఇంతలో యువతి అది కెమెరానేనని అనుమానించి, ఫోన్ ద్వారా పోలీసులకు రహస్యంగా మెసేజ్ పెట్టింది. దీంతో యువతి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మసాజ్ పార్లర్‌కు సీల్ వేసి, నిర్వాహకులను అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>