హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. మరుసటి రోజు ప్రియురాలు..

ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. మరుసటి రోజు ప్రియురాలు..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ప్రగ్యా(26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తకు ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు.

వారిద్దరూ ప్రేమికులు. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారిద్దరూ తనువు చాలించారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మొహాలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన సాహిల్ కుమార్(22) మొహాలిలోని సెక్టార్ 66లో ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ప్రగ్యా(26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తకు ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో పెయింగ్ గెస్ట్‌గా ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమోగానీ సాహిల్ కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ మరుసటి రోజు ప్రియుడిని విడిచి ఉండలేక ప్రగ్యా సైతం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుమార్ ఆత్మహత్య సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఇందులో కుమార్ ఆత్మహత్య చేసుకునే సమయంలో ప్రగ్యా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Haryana, Lovers suicide

ఉత్తమ కథలు