స్కూల్‌కు వెళ్లి వస్తున్న బాలికను ఎత్తుకెళ్లి... కారులో ముగ్గురి అత్యాచారం

17 ఏళ్ల మైనర్ బాలిక స్కూల్ నుంచి ఇంటికి బయల్దేరింది. సైకిల్ పై వెళ్తున్న అమ్మాయిని దారిలో కొందరు ఆకతాయిలు అటకాయించారు. అమ్మాయిని ఏడిపించారు. పక్కనే ఉన్నా కారులో పడేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు.

news18-telugu
Updated: June 30, 2019, 8:22 AM IST
స్కూల్‌కు వెళ్లి వస్తున్న బాలికను ఎత్తుకెళ్లి... కారులో ముగ్గురి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్లి వస్తున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన బీహార్ సారన్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం... 17 ఏళ్ల మైనర్ బాలిక స్కూల్ నుంచి ఇంటికి బయల్దేరింది. సైకిల్ పై వెళ్తున్న అమ్మాయిని దారిలో కొందరు ఆకతాయిలు అటకాయించారు. అమ్మాయిని ఏడిపించారు. పక్కనే ఉన్నా కారులో పడేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అలా ఐదు కిలోమీటర్ల వరకు బాలికను కారులో తీసుకెళ్లి... ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆతర్వాత బాలికను రోడ్డుపై పడేసి అక్కడ్నుంచి పరారయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వారిని అడిగి బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని భోరున విలపిస్తూ చెప్పింది. దీంతో హుటాహుటిన అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిపై అత్యాచారం చేస్తున్న సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు బాలిక తెలిపింది. అందులో ముగ్గురు బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బీహార్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా పోయిందని... విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీలో చేతులు కలిపిన నితీష్ సర్కార్ సమక్షంలో ప్రజలెవరూ సుఖ: శాంతులతో లేరని విమర్శిస్తున్నారు. మరోవపు ముజఫర్‌ పూర్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా ఇప్పటికే 155మంది చిన్నారులు మృతిచెందారు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు మరణాలు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.


First published: June 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు