హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియుడు మరోకరిని పెళ్లి చేసుకున్నాడనే వార్త విని విషం తాగిన ప్రియురాలు.. అసలు ఏం జరిగిందంటే..

ప్రియుడు మరోకరిని పెళ్లి చేసుకున్నాడనే వార్త విని విషం తాగిన ప్రియురాలు.. అసలు ఏం జరిగిందంటే..

ఈ క్రమంలోనే పదిరోజుల్లోనే అటు కూతురు కనపడకపోవడంతోపాటు ఇటు తండ్రి కూడా ఆత్మహత్య 

చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన చావుకు పోలీసులే కారణమని స్థానికులు 

ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పదిరోజుల్లోనే అటు కూతురు కనపడకపోవడంతోపాటు ఇటు తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన చావుకు పోలీసులే కారణమని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

తన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే వార్త విని ప్రియురాలు విషం తాగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

తన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే వార్త విని ప్రియురాలు విషం తాగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని బలిపట్న ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. బలిపట్న ప్రాంతంలోని సోమనా సాసన్ గ్రామానికి చెందిన ఓ మహళ(24).. అదే గ్రామానికి చెందిన కైల్ బెహరా కుమారుడు గోపాల్ బెహరాను(40) రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే కొన్ని విషయాలపై వీరిద్దరి మధ్య అపార్థాలు చోటుచేసుకున్నాయి. అయితే గతంలో ఆ మహిళపై గోపాల్ అత్యాచార యత్నం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు గోపాల్‌ను చితకబాది.. పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇటీవల గోపాల్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే వార్త విని ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న విషం తాగింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమెను వెంటనే బలిపట్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రాథమికి చికిత్స అందిన అనంతరం.. ఆమెను భువననేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై గోపాల్ తండ్రి స్పందిస్తూ.. ఆ యువతే తన కొడుకుతో సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. ఆమె కుటుంబ సభ్యులు తన కొడుకును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా దాడి చేశారని చెప్పారు. ఇక, యువతి తల్లి మాట్లాడుతూ.. గోపాల్ తన కూతురితో శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Lovers, Odisha

ఉత్తమ కథలు