అది గుజరాత్ (Gujarat)లోని రైల్వే స్టేషన్ (Railway station). స్టేషన్ పేరు వల్సద్ (Valsad) . పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా అంతమంది పోలీసులను చూసి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులు అక్కడే ఉన్న గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ (Gujarat queen Express)లోకి వెళ్లారు. ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని (dead body) గుర్తించారు. స్టేషన్లో (Indian Railway) రైలు ఆగి వున్న సమయంలో రైల్లోని ఓ కోచ్‌లో యువతి డెడ్‌బాడీ దొరకడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. యువతి ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు పోస్టుమార్టమ్ (Post mortem) రిపోర్టులో తేలింది. అయితే అంతకుముందు ఆమెపై గ్యాంగ్ రేప్ (Gang rape) జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత యువతి తన డైరీలో రాసుకున్న కొన్ని విషయాలు దీనికి బలం చేకూర్చేవిగా ఉన్నాయి.
ఆమె కాళ్లు, చేతులు కట్టేసి..
సౌత్ గుజరాత్‌కి (Gujarat) చెందిన ఆ యువతి వడోదరాలోని ఓ హాస్టల్లో (hostel) ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ఎన్జీవోలో పనిచేస్తోంది. ఆమె తన డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం... ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమె కాళ్లు, చేతులు కట్టేసి... కళ్లకు గంతలు కట్టి... ఆటోలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ బస్సు డ్రైవర్ వారిని గమనించి దగ్గరికి వెళ్లాడు. దీంతో భయపడిన ఆ ఇద్దరు వ్యక్తులు యువతిని అక్కడే వదిలి పారిపోయారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ సాయంతో ఆమె తన స్నేహితురాలి వద్దకు చేరింది.
25 బృందాలు.. 450 సీసీటీవీలు పరిశీలన..
ఆ యువతి తన డైరీ (diary)లో రాయకపోయినప్పటికీ... ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి (Gang rape) పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వడోదరా ఐజీ సుభాష్ త్రివేది మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందని వెల్లడించారు. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందో లేదో తేల్చి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించిందన్నారు. ఈ కేసు మిస్టరీని తేల్చేందుకు ఇప్పటికే 25 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ ల్యాబ్, రైల్వే పోలీస్, వడోదరా సిటీ పోలీస్ ఇలా ఆయా విభాగాలకు చెందినవారితో ఈ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 450 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు.
రేప్ గురించి తెలియడం లేదంటూ..
బాధితురాలు తన డైరీ (diary)లో స్పష్టమైన వివరాలు పేర్కొనలేదని... దీంతో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగింది లేనిది తెలియ రావట్లేదని అన్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు తేలిందన్నారు. మరిన్ని మెడికల్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని... అవి అందితే బాధితురాలి మృతిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ నిఘా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను ఉపయోగించి నిందితులను పట్టుకుంటామని ఐజీ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime news, Gujarat, Railway station