ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ చేసిన పనికి బాలిక ఆత్మహత్య

గ్రామ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన సర్పంచ్ ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు.

news18-telugu
Updated: October 8, 2020, 9:29 PM IST
ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ చేసిన పనికి బాలిక ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కెస్లాగూడలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన సర్పంచ్ ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకొమ్మని 17 ఏళ్ళ ఆ అమ్మాయి అడగడంతో నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ఆసుపత్రికి, అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు సర్పంచ్ గుణవంత్ రావు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసిన సర్పంచ్ గుణవంతురావు ను వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుధాకర్ తెలిపారు.

పెద్దవాళ్లు ఒప్పుకోకున్నా.. తాను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి యువతిని మోసం చేశాడో కానిస్టేబుల్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. రాప్తాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గ్రామ పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. తాడిపత్రిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే యువకుడితో 6 నెలల కిందట ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి. ఇంట్లో పెద్దలకు నచ్చలేదని సంబంధం వద్దనుకున్నారు. కానీ సదరు కానిస్టేబుల్‌ మాత్రం యువతిని ప్రేమిస్తున్నానని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు. ఇటీవల అతను తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఆ యువతి అతనితో మాట్లాడేందుకు తాడిపత్రికి వచ్చింది. కానీ ఆ కానిస్టేబుల్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. బస్టాండ్ కు వెళ్లి కుమిలిపోతూ.. వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మిగింది. ఇది గమనించిన ప్రయాణికులు యువతిని తాడిపత్రి ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను అనంతపురం తీసుకెళ్లారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2020, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading