హన్మకొండలో మరో ముగ్గురు కామ మృగాలు.. బాలికపై గ్యాంగ్ రేప్‌, ఆత్మహత్య..

Hanamkonda Rape Incident : అత్యాచారం తర్వాత అదే రోజు సాయంత్రం 5గంటలకు బాలికను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టారు. ఇంటికొచ్చిన బాలిక బోరున విలపిస్తూ నానమ్మకు అసలు విషయం చెప్పింది.

news18-telugu
Updated: August 12, 2019, 4:04 PM IST
హన్మకొండలో మరో ముగ్గురు కామ మృగాలు.. బాలికపై గ్యాంగ్ రేప్‌, ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హన్మకొండలో ఇటీవల శ్రీహిత అనే చిన్నారిపై ప్రవీణ్ అనే కామాంధుడి హత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇటీవలే వరంగల్ కోర్టు దోషికి ఉరిశిక్ష కూడా విధించింది. అయితే న్యాయస్థానాలు ఉరిశిక్ష అమలుచేస్తున్నా సరే..కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా అదే హన్మకొండలో మరో బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. అవమానాన్ని తట్టుకోలేక ఆపై ఆత్మహత్యకు పాల్పడింది.నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలికకు తల్లిదండ్రులు కూడా లేరు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆమె తరుపువారు ఆదివారం కాకతీయ యూనిర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండలోని సమ్మయ్యనగర్‌లో 15ఏళ్ల ఓ బాలిక ఆమె నానమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది.9వ తరగతి చదువుతున్న ఆ బాలికకు తల్లిదండ్రులు లేరు. ఇదే క్రమంలో శనివారం ఉదయం 11గంటలకు స్థానిక యువకులైన తిరుపతి,ప్రసన్న కుమార్‌లు బాలికను బయటకు వెళ్దామని చెప్పి పెంబర్తి గ్రామ సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లారు.అప్పటికే రాకేష్ అనే మరో యువకుడు అక్కడ వేచి ఉన్నాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచారం తర్వాత అదే రోజు సాయంత్రం 5గంటలకు బాలికను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టారు. ఇంటికొచ్చిన బాలిక బోరున విలపిస్తూ నానమ్మకు అసలు విషయం చెప్పింది. అత్యాచారం తర్వాత ఏదో ఇంజెక్షన్ కూడా ఇచ్చారని పేర్కొంది. అప్పటికే రాత్రయిపోవడంతో.. మరుసటి రోజు ఉదయం ఆ యువకులను దీనిపై నిలదీయాలని బాలిక నానమ్మ అనుకుంది. ఆరోజు రాత్రంతా ఆ బాలిక యువకులతో కంగారు కంగారుగా ఫోన్లు మాట్లాడింది. వాళ్లతో ఏం మాట్లాడిందో తెలియదు కానీ.. ఉదయాన్నే ఉరివేసుకుని కనిపించింది.షాక్ తిన్న బాలిక నానమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక తరుపు బంధువులు కేయూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు