హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love death: సిద్ధిపేట జిల్లాలో ప్రియుడితో పెళ్లికి రెడీ అయింది .. అతను హ్యాండివ్వడంతో ..

Love death: సిద్ధిపేట జిల్లాలో ప్రియుడితో పెళ్లికి రెడీ అయింది .. అతను హ్యాండివ్వడంతో ..

(ప్రాణం తీసిన ప్రేమ)

(ప్రాణం తీసిన ప్రేమ)

Love death:అబ్బాయిలతో ప్రేమలో పడటం..వాళ్లు చెప్పే మాయమాటలకు ఫ్లాట్ అవడం అమ్మాయిలకు పరిపాటిగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాటివ్వగానే సర్వం అర్పించుకోవడం ..అతను ముఖం చాటేయగానే డిప్రెషన్‌లో ఏదో ఒకటి చేసుకోవడం కామన్‌ అయింది. సిద్దిపేట జిల్లాలో కూడా 20ఏళ్ల యువతి అలాంటి పొరపాటే చేసింది.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

కొందరు అమ్మాయిలు ఐస్‌క్రీమ్ కంటే తొందరగా కరిగిపోతారు. అబ్బాయి చెప్పే మాటలకు, అతను చూపించే కల్పిత ప్రేమకు గుడ్డిగా నమ్మి వాళ్ల మాయలో పడిపోతారు. ప్రేమ పేరుతో పూర్తిగా పీకల్లోతులోకి మునిగిపోయిన తర్వాత ప్రియుడి స్థానంలో ఉంది తన కాబోయే మొగుడు కాదని..పచ్చి మోసగాడని తెలుసుకుంటారు. ఆ టైమ్‌లో దొంగ ప్రియుడు ఇచ్చిన షాక్‌కి తట్టుకోలేక ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకొని అందరికి దూరమవుతారు. సిద్దిపేట(Siddipeta) జిల్లా మనోహరాబాద్(Manoharabad)మండలంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. 20సంవత్సరాల(20Years old) శ్రావణి (Sravani)ఓ పరిశ్రమలో పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న మరో యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరిది ఒకే గ్రామం కావడం, ఒకే చోట పనిచేయడంతో పెద్దలు కూడ పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.

నమ్మింది.. నష్టపోయింది..

శ్రావణితో క్లోజ్‌గా తిరగడం , మాట్లాడటం చేశాడు. మృతురాలు కూడా ప్రియుడి సిన్సియర్‌ లవ్‌ని చూసి అతనికి మనసిచ్చింది. అతనే లోకమనుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామనే సంతోషంతో ఉండగానే యువకుడు షాక్ ఇచ్చాడు. అదే గ్రామానికి చెందిన మరో యువతిని తీసుకొని శనివారం గుట్టుచప్పుడు కాకుండా బోయినపల్లిలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ప్రేమించిన యువకుడు తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న శ్రావణి తీవ్రమనస్తాపానికి గురైంది.

ప్రేమికుడు కాదు మోసగాడు..

ఆదివారం ఇంట్లో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే గ్రామంలోని ఓ పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకోవాలని ప్రయత్నించింది. సాధ్యపడకపోవడంతో..వెంటనే పత్తి చేనులో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రేమలో విఫలమైన యువతి బలవన్మరణానికి పాల్పడం చూసిన స్థానికులు తండ్రికి సమాచారం చేరవేసారు. వెంటనే యువతిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే యువతి ప్రాణాలు విడిచింది.

ప్రాణం తీసిన మాయదారి ప్రేమ..

మృతురాలు శ్రావణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుడు మోసం చేశాడన్న బాధతో యువతి ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవనోపాధి కోసం పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న దంపతులు బిడ్డల కదలికలపై దృష్టి పెట్టకపోవడం, కొందరు తల్లిదండ్రులు పిల్లల సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలాంటి ఘోరాలు, దారుణాలు జరుగుతున్నాయని పోలీసులంటున్నారు.

First published:

Tags: Siddipeta, Woman suicide

ఉత్తమ కథలు