ఆస్పత్రి ICUలో యువతిపై గ్యాంగ్ రేప్... చేసిందెవరు?

ఆస్పత్రి ICUలోకి ఎవర్ని బడితే వాళ్లను వెళ్లనివ్వరు. ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. మరి అక్కడ గ్యాంగ్ రేప్ చేసిందెవరు?

news18-telugu
Updated: May 25, 2020, 8:35 AM IST
ఆస్పత్రి ICUలో యువతిపై గ్యాంగ్ రేప్... చేసిందెవరు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో ఎలాంటి దారుణాలైనా ఏమాత్రం ఆగకుండా జరిగిపోతున్నాయి. చివరకు ఆస్పత్రి ICUలో కూడా రక్షణ లేకుండా పోతోంది. ఛత్తీస్‌గడ్ బిలాస్‌పూర్‌. ఓ తండ్రి తన కూతుర్ని తీసుకొని... సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు. ఎస్సై వాళ్లను సీట్లలో కూర్చోమన్నాడు. ఏంటి మేటర్ అనగానే... ఆ తండ్రి విషయం చెప్పాడు. ఎస్సై ఆమె వైపు నిర్లక్ష్యంగా చూస్తూ... "సరే... కంప్లైంట్ రాసివ్వండి... ఎంక్వైరీ చేస్తాం" అంటూ... బాయ్‌కి టీ తెమ్మని చెప్పాడు. ఆమె కంప్లైంట్ రాసింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని తెలిపింది. అందుకు ఆస్పత్రిలోని వార్డ్ బాయ్సే కారణం అని ఆరోపించింది.

అసలేం జరిగిందంటే... మే 18న 18 ఏళ్ల బాధిత యువతి... ఏదో అనారోగ్య సమస్య వస్తే మందులు వాడింది. అవి తేడా కొట్టాయి. మరో రకమైన అనారోగ్యం, అలర్జీ లాంటిది వచ్చింది. దాన్ని చూపించుకుందామని బిలాస్‌పూర్‌లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కి వెళ్లింది. అప్పటికే ఆమె చాలా నీరసంగా, మాట్లాడలేని స్థితికి వచ్చేసింది. డాక్టర్లు ఆమెను ICUకి తీసుకెళ్లారు. ఓ పూటంతా ఉంచి... ఏదో ట్రీట్‌మెంట్ చేసి... ఇక సమస్య ఉండదనీ... ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ... ఆమె అప్పటికే పూర్తిగా మాట్లాడలేని స్థితికి చేరింది. డాక్టర్లు చెప్పారు కదా అని ఇంటికి వెళ్లింది.

ఇంటి దగ్గర బెడ్‌పై పడుకొని... మర్నాడు.. తనకు ఓ పెన్నూ, పేపరూ కావాలని సైగలు చేసింది. వాళ్లు ఇచ్చారు. దానిపై తనను ఆస్పత్రిలో వార్డ్ బాయ్స్ గ్యాంగ్ రేప్ చేశారని రాసింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులకు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుందామంటే... ఆమె మాట్లాడే స్థితిలో లేదు.

ఆమెకు నీరసం కాస్త తగ్గిన తర్వాత... తండ్రి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమె ఏదీ మాట్లాడలేదు. ఆమె నోరు విప్పట్లేదనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసులు లైట్ తీసుకున్నారు. ఐతే... యువతి ఇంట్లో రాసిన మేటర్... సోషల్ మీడియాకి ఎక్కింది. అది వైరల్ అయ్యింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి TS సింగ్ దేవ్... స్పందించారు. హైలెవెల్ టీంతో ఈ కేసును దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతే... పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ప్రస్తుతం ఆ యువతిని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల రిపోర్టును బట్టీ... దర్యాప్తు సాగనుంది.
First published: May 25, 2020, 8:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading