Home /News /crime /

Attempt to suicide: ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో రాసింది తెలిస్తే షాక్..

Attempt to suicide: ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో రాసింది తెలిస్తే షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Attempt to suicide: ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహ్యతకు పాల్పపడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

  డిగ్రీ చదివిన యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగా విధు ముగించుకొని ఓ రోజు వస్తుండగా ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు స్నేహితులుగా కలిసి ఉన్నారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తెలిసిన బంధువులకు, స్నేహితులకు కూడా త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలో ఏ మయిందో కానీ ఇటీవల అతదు తన ప్రేయసి వద్దకు వెళ్లి పెళ్లిచేసకుందాం అని చెప్పాడు. పెళ్లా.. నీతోనా అంటూ ఆమె నిరాకరించింది. అంతే కాకుండా తనకు ఇతనితో పెళ్లి ఇష్టం లేదని స్థానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరీ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో అతడికి నోటి వెంట మాట రాలేదు. ఏమి చేయాలో అర్థం కాలేదు. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి ఇలా మాట్లాడుతుందేంటి అనుకున్నాడు. తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ప్రేయసి మోసం చేసన విషయాన్ని తట్టుకోలేక ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనిది చూసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సంఘటన జైపూర్‌ మండలంలోని కాన్కూర్‌ గ్రామానికి చెందిన మధునక్క, శంకర్‌ దంపతుల కుమారుడు మహేశ్‌ డిగ్రీ చదువుతున్నాడు. తన కుటుంబ పరిస్థతి మంచిగలేక అతడు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చదువును మధ్యలో మానేయకుండా చదువుకుంటూనే ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే మంచిర్యాలలోని చున్నంబట్టి వాడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేశ్‌ తన ప్రేయసి ఇంటికి వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం.. అని తెలపగా.. దానికి యువతి నిరాకరించింది. పోలీసులను ఆశ్రయించి తనకు మహేశ్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన మహేశ్‌ కాన్కూర్‌ గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు .

  గమనించిన స్థానికులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యులు తెలిపారు. వెంటనే అతడిని కుటుంబసబ్యులు హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలన్ని మహేశ్‌ రాసిన సూసైడ్‌నోట్‌ లభించింది. కుటుబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Attempt to suicide, Crime, Crime news, Love affair, Manchiryala, Telangana

  తదుపరి వార్తలు