మరదలితో బావ వివాహేతర సంబంధం.. చివరకు..

తన భార్య చెల్లెలితో సన్నిహితంగా ఉంటూ చివరకు ఆమెను గర్భవతిని చేశాడు ఓ వ్యక్తి.

news18-telugu
Updated: May 19, 2020, 9:49 PM IST
మరదలితో బావ వివాహేతర సంబంధం.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అక్క భర్తతో వివాహేతర సంబంధం ఓ బాలిక పాలిట శాపమైంది. బావే కదా అని చనువుగా ఉంటే... చివరకు అదే ఆమె చావుకు కారణమైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కంచిలి మండలానికి చెందిన కిరణ్‌ కొంతకాలంగా కోల్‌కతాలో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో సొంతూరుకు వచ్చిన అతడు... తన భార్య చెల్లెలిలో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కిరణ్‌ కోల్‌కతా వెళ్లిపోయారు. అతను వెళ్లిపోయిన తరువాత అతడి మరదలు గర్భవతి అని తల్లికి తెలిసింది. బావ కారణంగానే ఇలా జరిగిందని బాలిక అసలు విషయం తల్లికి చెప్పింది. దీంతో ఆమె తల్లి కోల్‌కతాలో ఉన్న అల్లుడికి ఫోన్‌ చేసి ప్రశ్నించింది.

తాను లాక్‌డౌన్‌లో చిక్కుకున్నానని, ప్రస్తుతానికి అబార్షన్‌ చేయించాలని, డబ్బులు పంపిస్తానని కిరణ్ సమాధానం ఇచ్చాడు. దీంతో చేసేదేమీ లేక ఈ నెల 8న సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్‌ చేయించారు. అయితే ఈ నెల 16వ తేదీన బాలికకు తీవ్ర రక్తస్రావమై కడుపులో నొప్పి రావడంతో శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రికి కూడా అదే రోజు సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం బాలిక మృతి చెందింది. బాలిక ఇచ్చిన తల్లి ఫిర్యాదు మేరకు బావ కిరణ్, అబార్షన్‌ చేసిన వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

First published: May 19, 2020, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading