Mob Thrashed Girl: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుందని యువతిపై స్థానికుల ఆగ్రహం.. ఇంత ఘోరంగా దాడి చేస్తారా..?

ప్రతీకాత్మక చిత్రం

ఏకాంత ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుంటున్న ఒక జంటను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేశారు. ప్రణాళిక ప్రకారం వారిపై దాడికి పాల్పడ్డారు.

  • Share this:
కొందకు వ్యక్తులు ఒక యువతిపై సామూహికంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాప్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్న ఒక జంటను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేశారు. ప్రణాళిక ప్రకారం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గత వారం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. అయితే యువకుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ పట్టుబడిన యువతిని దారుణంగా హింసించారు. ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్‌ను బలవతంగా తొలగించారు. ఆమె దుప్పట్టా తీసివేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఒక యువతి తన స్నేహితుడితో కలిసి ఏకాంత ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతుండగా.. కొంతమంది స్థానిక యువకులు గమనించారు. గుంపుగా వారి వద్దకు వెళ్లి బెదిరించడంతో యువకుడు పారిపోయాడు. అనంతరం యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను దుర్భాషలాడుతూ దుప్పట్టాతో ఈడ్చుకెళ్లినట్టు వీడియోలో కనిపిస్తోంది. భయంతో కేకలు వేస్తూ రోధిస్తున్నా ఆమెను వదల్లేదు. స్థానికులు ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఏకాంత ప్రదేశానికి ఒక యువకుడితో వెళ్లినందుకు ఆమెపై ఒక వర్గం వ్యక్తులు దాడి చేశారని స్థానికులు తెలిపారు.

* దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని భరత్‌పూర్ జిల్లా ఎస్పీ దేవేంద్ర బిష్ణోయ్ తెలిపారు. నిందితులను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. రాజస్థాన్‌కు హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. ఈ వ్యవహారంపై స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రాజస్థాన్‌లో సామూహిక దాడుల కేసులు గతంలోనూ నమోదయ్యాయి. 2019 అక్టోబర్‌లో.. అల్వార్ బస్టాప్‌లో ఒక జంటపై మరో వర్గానికి చెందిన యువకులు వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసులోనూ అలాంటి సత్వర న్యాయమే కావాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published: