హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: నాపై 28 మంది అత్యాచారం జరిపారు.. మా నాన్నే ముందుగా.. బాలిక ఆవేదన.. ఎఫ్‌ఐఆ‌ర్‌లో రాజకీయ నాయకుల పేర్లు..

Shocking: నాపై 28 మంది అత్యాచారం జరిపారు.. మా నాన్నే ముందుగా.. బాలిక ఆవేదన.. ఎఫ్‌ఐఆ‌ర్‌లో రాజకీయ నాయకుల పేర్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనపై కొన్నేళ్ల పాటు 28 మంది అత్యాచారానికి పాల్పడినట్టుగా ఓ 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. అందులో తన తండ్రి కూడా ఉన్నట్టుగా చెప్పింది. ఈ దారుణానికి తన తండ్రే అసలు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనపై కొన్నేళ్ల పాటు 28 మంది అత్యాచారానికి పాల్పడినట్టుగా ఓ 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. అందులో తన తండ్రి కూడా ఉన్నట్టుగా చెప్పింది. ఈ దారుణానికి తన తండ్రే అసలు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లలిత్‌పూర్ జిల్లాలో (Lalitpur district) చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి (Rape) పాల్పడినవారిలో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party), బహుజన సమాజ్‌వాదీ పార్టీ (Bahujan Samaj Party)నేతలు, కొందరు సమీప బంధువులు ఉన్నట్టుగా బాలిక తన ఫిర్యాదులో ఆరోపించింది. గత కొన్నేళ్లుగా వాళ్లు తనపై అత్యాచారం చేసినట్టుగా పేర్కొంది. ఈ మేరకు టైమ్స్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. బాలిక ఫిర్యాదు మేరకు లలిత్‌పూర్ పోలీసులు 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో బాలిక తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, ఆ పార్టీ సిటీ అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజ్‌హియా, బహుజన్ సమాజ్ పార్టీ దీపక్ అహిర్వార్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై ఐపీసీ సెక్షన్లు 354, 376-డీ, 323, 506లతో పాటుగా పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

‘నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో మా నాన్న నాకు అసభ్యకరమైన చిత్రాలు చూపించాడు. ఆ సమయంలోనే లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. తర్వాత ఒకరోజు నాకు కొత్త బట్టలు తీసుకొచ్చి.. బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి.. అక్కడ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో నన్ను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. స్నాక్స్ తినడం కోసం అక్కడికి వెళ్తున్నట్టుగా చెప్పాడు. అయితే వాటిలో మత్తుమందు కలిపాడు. ఆ తర్వాత ఓ మహిళకు నన్ను అప్పగించాడు. ఆమె నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి ఒంటరిగా వదిలిపెట్టింది. కొద్దిసేపటికి అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు.. అయితే అప్పుడే నేను స్పృహ కోల్పోయాను. నేను స్పృహలోకి వచ్చేసరికి నా దుస్తులు, షూస్ సరిగా లేవు. నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. తర్వాత కూడా ఇది కొనసాగింది. ప్రతిసారి ఓ కొత్త వ్యక్తి హోటల్ రూమ్‌లో నాపై అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

Uthra Case Verdict: భార్యను పాముతో కరిపించి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు.. ఆమె భర్తకు ఎలాంటి శిక్ష పడిందంటే..


ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించేవారు. కొన్ని రోజులకు తిలక్ యాదవ్ (Tilak Yadav) వచ్చి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కనికరం కూడా లేకుండా ప్రవర్తించాడు. అయితే తాను ప్రతిఘటిస్తే.. నా తండ్రే పంపాడని చెప్పాడు. తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు’అని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా ఓ సారి తన మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ బంధువులే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అంతేకాకుండా ఓ సమయంలో తన అంకుల్ తనను అమ్మేందుకు ప్రయత్నించాడని.. కానీ అది వీలు పడలేదని చెప్పింది.

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో బెస్ట్‌ డీల్స్‌ పొందడం ఎలా?.. ఈ ట్రిక్స్ తెలుసుకోండి..


ఈ ఘటనకు సంబంధించి లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ (Nikhil Pathak) టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘ఇది చాలా సున్నితమైన కేసు. మేము దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాం. సెక్షన్ 161 కింద ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశాం. బుధవారం సెక్షన్ 164 ప్రకారం మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. బాధితురాలి తండ్రి ట్రక్ డైవర్ అని, అతడిని ప్రశ్నిస్తున్నామని ఎస్పీ నిఖిల్ చెప్పారు.

మరోవైపు బాధితురాలి ఫిర్యాదుపై సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను ఈ కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణల్ని ఆయన ఖండించారు.

First published:

Tags: Crime news, RAPE, Uttar pradesh

ఉత్తమ కథలు