దీపావళి రోజు గుడ్లగూబను బలిస్తే ధనవంతులు అవుతారా..?

హిందూ పురాణాల్లోనూ గుడ్లగూబ ప్రస్తావన ఉంది. చాలామంది గుడ్లగూబను అశుభంగా భావిస్తారు గానీ.. పురాణాల్లో దాన్ని శుభసూచకంగా పేర్కొన్నట్టు చెబుతారు.

news18-telugu
Updated: October 23, 2019, 1:50 PM IST
దీపావళి రోజు గుడ్లగూబను బలిస్తే ధనవంతులు అవుతారా..?
గుడ్లగూబలు
news18-telugu
Updated: October 23, 2019, 1:50 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అక్రమంగా గుడ్లగూబలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుదైన జాతికి చెందిన ఈ గుడ్లగూబలకు బ్లాక్ మార్కెట్‌లో లక్షల రూపాయలకు విక్రయిస్తారని పోలీసులు తెలిపారు. దీపావళి సందర్భంగా గుడ్లగూబలకు డిమాండ్ పెరిగిందన్నారు. దీపావళి రోజు లక్ష్మి పూజ సందర్భంగా గుడ్లగూబను బలిస్తే.. ఆ ఇంట్లో లక్ష్మి దేవి కొలువుదీరుతుందని చాలామంది విశ్వసిస్తారని తెలిపారు. అలాగే గుడ్లగూబ ఎముకలు కూడా మార్కెట్లో అధిక ధర పలుకుతాయని.. అందుకే వాటిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. సుమిత్ కుమార్,ప్రదీప్
కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఒక బకెట్‌లో వాటిని దాచిపెట్టి తరలిస్తుండగా వైశాలి సెక్టార్ 5లో పట్టుకున్నట్టు తెలిపారు. ఒక అంచనా ప్రకారం దేశంలో గుడ్లగూబల ట్రేడింగ్‌కి ఆగ్రా మేజర్ హబ్‌గా మారిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,దీపావళి రోజు గుడ్లగూబను బలిచ్చే ఆచారం కొనసాగుతోందని పోలీసులు తెలపడం చర్చనీయాంశంగా మారింది. లక్ష్మిదేవికి గుడ్లగూబకు

కాగా, హిందూ పురాణాల్లోనూ గుడ్లగూబ ప్రస్తావన ఉంది. చాలామంది గుడ్లగూబను అశుభంగా భావిస్తారు గానీ.. పురాణాల్లో దాన్ని శుభసూచకంగా పేర్కొన్నట్టు చెబుతారు. రాత్రి నాలుగవ జాములో గుడ్లగూబ ఎవరి ఇంటిపై వాలుతుందో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాల్లో ఉందంటారు. అలాగే త్వరగా సంపన్నులు కావాలని కలలు కనేవారు వైభవ లక్ష్మి వాహనమైన గుడ్లగూబను బలి ఇచ్చే మూఢ ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మనదేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా గుడ్లగూబలను బలి ఇస్తున్న ఘటనలు అనేకం. కొంతమంది వశీకరణ కోసం కూడా గుడ్లగూబలను బలిస్తుంటారు. ఈ మూఢ నమ్మకాల కారణంగానే మార్కెట్లో గుడ్లగూబలకు డిమాండ్ పెరిగింది. ఒక్కో గుడ్లగూబను దాదాపు రూ.30వేల నుంచి రూ.50వేలకు విక్రయిస్తున్నట్టు సమాచారం.అయితే గుడ్లగూబలను బలి ఇస్తే ధనవంతులు అవుతారనేది మూఢ నమ్మకం అని చాలామంది కొట్టిపారేస్తున్నారు.



First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...