వీడిన మిస్టరీ : ఘట్‌కేసర్ తల్లీబిడ్డల హత్యలో ఇదీ అసలు నిజం..

గర్భిణి అని చెప్పడంతో కోర్టు కూడా విడాకులు వాయిదా వేసింది. భార్య శుశ్రుత గర్భం దాల్చినట్టు తనకూ అప్పుడే తెలియడంతో రమేశ్‌లో అనుమానం పెరిగింది. ఇటీవలే శుశ్రుత మగబిడ్డకు జన్మనివ్వడంతో నామకరణ ఫంక్షన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అత్తింటివారితో గొడవపడి వచ్చాడు.

news18-telugu
Updated: February 12, 2019, 7:07 AM IST
వీడిన మిస్టరీ : ఘట్‌కేసర్ తల్లీబిడ్డల హత్యలో ఇదీ అసలు నిజం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 7:07 AM IST
పరువు హత్యగా వెలుగులోకి వచ్చిన ఘట్‌కేసర్ తల్లీబిడ్డల హత్య కేసులో అసలు నిజాలు వెలుగుచూశాయి. అనుమానంతోనే భార్యా బిడ్డలను చంపేసినట్టు నిందితుడు రమేశ్(27) పోలీసుల విచారణలో వెల్లడించాడు. విభేదాలతో తన నుంచి దూరంగా ఉంటున్న భార్య.. గర్భవతి అని తెలియడం రమేశ్‌లో అనుమానాన్ని రేకెత్తించింది. అదే అనుమానంతో ప్లాన్ ప్రకారం హత్యకు స్కెచ్ వేసి వారిని అంతమొందించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. రమేశ్-శుశ్రుతలు 2015లో ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కొన్నాళ్లకు ఇరువురి మధ్య విభేదాలు రావడంతో శుశ్రుత పుట్టింటికి వెళ్లింది. ఆపై విడాకుల కోసం ఇద్దరూ ఫ్యామిలీ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారు. అలా ఎనిమిది నెలలుగా శుశ్రుత పుట్టింటిలోనే ఉంటోంది. కొన్ని నెలల క్రితం కోర్టులో చివరి వాయిదా కోసం వచ్చినప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణీ అని రమేశ్‌కు తెలిసింది.

గర్భిణి అని చెప్పడంతో కోర్టు కూడా విడాకులు వాయిదా వేసింది. భార్య శుశ్రుత గర్భం దాల్చినట్టు తనకూ అప్పుడే తెలియడంతో రమేశ్‌లో అనుమానం పెరిగింది. ఇటీవలే శుశ్రుత మగబిడ్డకు జన్మనివ్వడంతో నామకరణ ఫంక్షన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అత్తింటివారితో గొడవపడి వచ్చాడు. ఇదే క్రమంలో తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని సొంతింటి వారు కూడా అతన్ని దూరం పెట్టారు. సొంత తమ్ముడి పెళ్లికే అతన్ని ఆహ్వానించలేదు.

వీటన్నింటికి కారణం భార్యనే అని భావించిన రమేశ్.. ఆమెను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. జరిగిందేదో జరిగింది.. ఉప్పల్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నా.. కొత్త జీవితం మొదలుపెడుతాం రమ్మని శుశ్రుతకు ఫోన్ చేశాడు. నిజమనుకుని వచ్చిన ఆమెను ఘట్‌కేసర్‌ సమీపంోలని కొండాపూర్ తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌తో మృతదేహాలను కాల్చేశాడు. మరుసటి రోజు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఇది కూడా చదవండి : పరువు హత్యేనా..? ఘట్‌కేసర్‌ ఘటనలో అసలేం జరిగింది..
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...