పరువు హత్యేనా..? ఘట్‌కేసర్‌ ఘటనలో అసలేం జరిగింది..

రమేశ్ చెప్పిన విషయాల్లో నిజమెంత అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. హత్య జరిగిన సమీపంలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలించనున్నారు. ఇది పరువు హత్యా.. లేక భార్యాభర్తల మధ్య విభేదాలే హత్యకు దారి తీశాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: February 11, 2019, 7:55 AM IST
పరువు హత్యేనా..? ఘట్‌కేసర్‌ ఘటనలో అసలేం జరిగింది..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 11, 2019, 7:55 AM IST
హైదరాబాద్ ఘట్‌కేసర్ సమీపంలోని ఔటర్‌ రింగ్ రోడ్ వద్ద వెలుగుచూసిన తల్లీబిడ్డల హత్య కేసులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. హత్య చేసింది తానే అని మృతురాలు శుశ్రుత భర్త జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు దారి తీసిన పరిస్థితులు.. హత్య చేసిన తీరు గురించి పోలీసులకు వివరించాడు.ఇద్దరి మధ్య విభేదాలే హత్యకు దారి తీశాయని రమేశ్ చెబుతుండగా.. పరువు హత్య అని శుశ్రుత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటంతో.. నిజానిజాలు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

నిందితుడు రమేశ్(27) పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరుకి చెందిన తాను కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కార్పేంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన శుశ్రుత(26)తో పరిచయం ఏర్పడింది. ఆమె నగరంలో బీఫార్మసీ చదువుతోంది.

వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారితీసి సహజీవనం వరకు వెళ్లింది. సహజీవనం చేస్తున్న సమయంలోనే శుశ్రుత గర్భం దాల్చింది. అయితే శుశ్రుతను రమేశ్ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అతని తల్లిదండ్రులు అప్పట్లో అతన్ని గృహ నిర్బంధం చేశారు. దీంతో అతని ఇంటి ముందు నిరసనకు దిగి ప్రజా సంఘాల సహాయంతో ఎట్టకేలకు శుశ్రుత రమేశ్‌ను వివాహం చేసుకుంది.2015లో వీరి పెళ్లి జరగ్గా.. అప్పటినుంచి ఘట్‌కేసర్ సమీపంలోని కొండాపూర్ ప్రాంతంలో కాపురం పెట్టారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో ఆ తర్వాత కలహాలు మొదలయ్యాయి. భర్తతో విభేదాలతో శుశ్రుత 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. రెండు నెలల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ నామకరణ కార్యం నిర్వహించిన రోజు కూడా రమేశ్-శుశ్రుతల మధ్య గొడవ జరిగింది.

తనతో విభేదాలతో దూరంగా ఉంటున్న భార్య శుశ్రుతను రమేశ్ శనివారం హైదరాబాద్ పిలిపించాడు. బంధువుతో కలిసి ఉప్పల్ బస్ స్టాప్‌ వద్దకు వచ్చిన ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. భార్య, బిడ్డలను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు.శనివారం రాత్రి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శుశ్రుత నిద్రమాత్రలు మింగింది. బాబుకు కూడా నిద్ర మాత్ర వేసింది. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో రాత్రి 9గంటలకు కొండాపూర్‌లోని ప్రభాకర్ ఎన్‌క్లేవ్ వద్దకు తీసుకెళ్లాను. అక్కడే ఇద్దరి గొంతు నులిమి.. ఆపై సమీపంలోని పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ తీసుకొచ్చి వారిని తలబెట్టాను.
నిందితుడు రమేశ్


రమేశ్ చెప్పిన విషయాల్లో నిజమెంత అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. హత్య జరిగిన సమీపంలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలించనున్నారు. ఇది పరువు హత్యా.. లేక భార్యాభర్తల మధ్య విభేదాలే హత్యకు దారి తీశాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...