GENDER REASSIGNMENT SURGERY FOR LOVE IN MUMBAI BUT HERE IS THE SHOCKING VB
Double Shocking: ఇద్దరూ మగవాళ్లు అయి ఉండి ఇదేం బుద్ది.. ఆ పని కోసం ఎంత పనిచేశావయ్యా..
జమాల్ మరియు ఫుర్ఖాన్ (ఫైల్)
Double Shock: ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటేనే దానిని వివాహం అంటారు. ఆ వివాహానికే చట్ట బద్దత కూడా ఉంది. ఆ వివాహాన్నే పెద్దలు అయినా.. సమాజం అయిన గౌరవిస్తారు. కానీ ఇక్కడ జరిగిన వ్యవహారం తెలిస్తే.. షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే..
ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి పెళ్లిచేసుకుంటేనే దానిని వివాహం అంటారు. ఆ వివాహానికే చట్ట బద్దత కూడా ఉంది. ఆ వివాహాన్నే పెద్దలు అయినా.. సమాజం అయిన గౌరవిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక పురుషుడు మరో పురుషుడిని.. ఒక మహిళ మరో మహిళను ప్రేమించుకోవడంతో పాటు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ జంట(పురుషుడు, పురుషుడు) కూడా ఇలాగే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం కొన్ని రోజుల క్రితం వైరల్ అయింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే.. ఒక యువకుడు మరో యువకుడిని ప్రేమించాడు. ఇంత వరకు బాగానే ఉంది.. అందులో ఒకరు.. లింగ మార్పిడి చేయించుకో ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ చెబుతాడు.
ఇలా ప్రియుడు మాటలు విన్న సదరు వ్యక్తి లింగమార్పిడి చేయించుకుంటాడు. చివరికి ఆ ప్రియుడు మోసం చేస్తాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయి నగరానికి చెందిన జమాల్ షేక్ (31), ఫుర్ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించాడు. జమాల్ ది అసలు ప్రదేశం కోల్ కత్తా. అతడు 16 ఏళ్ల క్రితం అక్కడ నుంచి ముంబయికి వచ్చి ఇక్కడే ఉంటుంన్నాడు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం ఫుర్ఖాన్తో ప్రేమలో పడ్డాడు. అయితే అతడు ఒక యువకుడు. మరి అతడికి ఏమనిపించిందో ఏమో గానీ.. పురుషుడిని ప్రేమించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..జామాల్ ను కూడా ఫుర్ ఖాన్ ప్రేమించాడు. ఇలా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది.
ఓ రోజు ఫుర్ ఖాన్ కు ఓ ఆలోచన వచ్చింది. జమాల్ నువ్వు లింగ మార్పిడి చేయించుకో.. ఇంతకంటే డబుల్ ఆనందంగా ఉంటాం.. అప్పుడు పెళ్లి కూడా చేసుకోవచ్చు అని చెబుతాడు. ఆ మాటలను నమ్మిన జమాల్.. రూ.2 లక్షలు ఖర్చుపెట్టి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని శిల్పగా మారాడు. అంటే జమాల్ కాస్త శిల్పగా పేరు మార్చుకున్నాడు. తర్వాత ఫుర్ ఖాన్ కనిపించకుండా పోయాడు. ఫుర్ఖాన్ తనను మోసగించి ఢిల్లీకి పారిపోయాడని తెలుసుకొని ఆందోళన చెందాడు.
ఫుర్ఖాన్కు అవసరమున్న ప్రతీసారి డబ్బు ఇచ్చానని, ఫుర్ఖాన్కు ఇంతకుముందే వివాహం జరిగినా.. తనను ప్రేమించానని చెప్పడంతో నమ్మి మోసపోయినట్లు జమాల్ తెలిపాడు. అతడి మాటల వల్లే తాను లింగ మార్పిడి చేయించుకున్నానని.. తనను తల్లిదండ్రులు ఇంట్లోకి కూడా రానివ్వడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయండంటూ పోలీసులను ఆశ్రయించినా.. వాళ్లు తన కేసును స్వీకరించడం లేదని.. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు జమాల్ అలియాస్ శిల్ప.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.