Home /News /crime /

GELATIN MAN GIVES WIFE A HUG OF DEATH IN GUJARAT PVN

Shocking : భార్యను హగ్ చేసుకుని అది నొక్కాడు..అంతే సెకన్లలో ఇద్దరూ మృతి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Sucide Blast : గురువారం రాత్రి భార్య దగ్గరకు వెళ్లి ఆమెను హగ్ చేసుకున్నాడు. భర్తే కదా ఆమె ఏమీ అనలేదు. అయితే భార్యను హగ్ చేసుకున్న వెంటనే భర్త ఓ బటన్ నొక్కాడు.

Man gives wife a hug of death : కొన్నాళ్లుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య కొద్దిరోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే గురువారం రాత్రి భార్య దగ్గరకు వెళ్లి ఆమెను హగ్ చేసుకున్నాడు. భర్తే కదా ఆమె ఏమీ అనలేదు. అయితే భార్యను హగ్ చేసుకున్న వెంటనే భర్త ఓ బటన్ నొక్కాడు. సెకన్ల వ్యవధిలో దంపతులిద్దరూ మరణించారు. గుజరాత్​లోని ఆరవల్లి జిల్లాలో ఈ ఘటనకు జరిగింది.

గుజరాత్​లోని ఆరవల్లి జిల్లాలోని ములోజ్​ గ్రామానికి చెందిన లాలా పాగీ (47), శారదాబెన్​ కు (43) ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. లాలా పాగీ తరచూ భార్యను వేధిస్తుండేవాడు. నెల రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగడం వల్ల శారదా​ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పట్టలేక ఆమెను హత్య చేయాలని భావించాడు భర్త లాలా పాగీ. ఈ క్రమంలో శరీరానికి పేలుడు పదార్థాలు(జిలెటిన్ స్టిక్స్) చుట్టుకుని గురువారం రాత్రి ఆమె​ ఉంటున్న బీటీ ఛప్రా గ్రామానికి వెళ్లాడు. శారదాబెన్​ ఇంటి నుంచి​ బయటకి రాగానే ఆమెను హగ్ చేసుకొని డిటోనేటర్​ నొక్కి పేల్చేసుకున్నాడు. పేలుడు ధాటికి ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు పదార్థాలు నిందితుడికి ఎవరు అందించారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో లాలా పాగీ ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bomb blast, Gujarat, Husband kill wife

తదుపరి వార్తలు