బీహార్‌లో మరో ‘పరువు హత్య’... 16 ఏళ్ల బాలిక తల నరికి... అతి దారుణంగా...

గయా పట్టణంలో వెలుగుచూసిన దారుణం... మొదట కుటుంబసభ్యులే చంపారని చెప్పిన బాలిక సోదరి... తర్వాత పోలీసుల టార్చర్ కారణంగానే అలా చెప్పానని మాట మార్చిన యువతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 7:56 PM IST
బీహార్‌లో మరో ‘పరువు హత్య’... 16 ఏళ్ల బాలిక తల నరికి... అతి దారుణంగా...
బాలిక కేసు సాగతీతకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న గ్రామస్థులు
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 7:56 PM IST
బీహార్‌లో మరో ‘పరువు హత్య’ వెలుగు చూసింది. వేరే కులానికి చెందిన అబ్బాయితో తిరుగుతోందనే కారణంగా... ఓ 16 ఏళ్ల బాలికను అతిదారుణంగా కొట్టి, తల నరికేశారు కుటుంబసభ్యులు. తల నరికేసిన తర్వాత ముఖంపై యాసిడ్‌తో కాల్చారు. గత ఏడాది డిసెంబర్ 28న కనిపించకుండా పోయిన అమ్మాయి... జనవరి 6న కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దాంతో తమ కూతురిపై అత్యాచారం జరిగి ఉంటుందని, కిరాతకులు ఎవరో దారుణంగా చంపేశారని ఆరోపించారు ఆమె తల్లిదండ్రులు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్నిరోజులకు యువతి అక్క... సంచలన విషయం బయటపెట్టింది. వేరే కులానికి చెందిన అబ్బాయితో తన చెల్లెలు లేచిపోయిందని, డిసెంబర్ 31న ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటికి వచ్చిందని... కూతురు కనిపించగానే ఆవేశంతో తన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు కలిసి ఆమెను అతిదారుణంగా కొట్టి చంపేశారని చెప్పింది.

దీంతో బీహర్‌లో గయా పట్టణంలో వెలుగుచూసిన ఈ దారుణంగా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. బాలిక ఛాతిపైనా తీవ్రమైన గాయాలు ఉండడం, యాసిడ్‌తో కాల్చినట్టుగా గుర్తులు కనిపించడంతో చిన్నారిపై కన్నవాళ్లే ఇంత దారుణానికి ఒడిగట్టారనే విషయం ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. తాజాగా బాలిక అక్క మాట మార్చడం విశేషం. తమను పోలీస్ స్టేషన్‌లో చిత్ర హింసలు పెట్టారని, తల్లికి కరెంట్ షాక్ ఇచ్చి సామూహిక హత్యాచారాన్ని ‘పరువు హత్య’గా చెప్పాలని భయపెట్టినట్టు పేర్కొంది. దీంతో స్థానికంగా సంఘటన సంచలనం క్రియేట్ చేసింది. సంఘటన వెలుగు చూసి ఐదురోజులు గడుస్తున్నా అసలు ఏం జరిగిందో పోలీసులు కనుక్కోలేకపోవడంతో గ్రామస్థులంతా స్పందించారు. కొవ్వొత్తులు, ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే బాలిక కనిపించడం లేదని చెప్పినా, పోలీసులు పట్టించుకోలేదని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దీంతో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందా? లేక పరువు హత్యేనా అనేది తెలియక పోలీసులు అయోమయానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

స్వీట్లు, స్నాక్స్ ఇచ్చి 12 ఏళ్ల మైనర్‌పై 3 నెలలుగా అత్యాచారం... గర్ల్‌ఫ్రెండ్ అనుమానంతో...
‘ఐ లవ్ యూ’... భార్య వాట్సాప్‌కు మెసేజ్... భర్త ఆత్మహత్య...


ఓమైగాడ్... ఏడుపులు వినగానే కళ్లు తెరిచిన శవం... ఆ తర్వాత...


‘ఆమెగా మారిన అతను’... ఈ వ్యక్తి ఆడా? మగా? హైదరాబాద్ పోలీసులకు వింత 
Loading...
జైలుకెళ్లి తండ్రిని చూసి వస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్... మూడు నెలల తర్వాత...
వీల్‌ఛైర్ వివాహం... ఆసుపత్రిలో ఒక్కటైన ప్రేమజంట...
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...