గే సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. కరెంట్ షాక్ ఇచ్చి...

గే ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్‌ను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ గే సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: September 15, 2019, 8:11 PM IST
గే సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. కరెంట్ షాక్ ఇచ్చి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని గే సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. నోయిడా సిటీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గే సెక్స్ రాకెట్‌కు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. గే ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్‌ను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ గే సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ డేటింగ్ యాప్ ద్వారా నిందితులు నోయిడాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత వారు ఆ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. తాము చెప్పిన వారికి సుఖాన్ని అందించాలని ఒత్తిడి తెచ్చారు. అయితే, ఆ వ్యక్తి అందుకు నిరాకరించాడు. కానీ, వారు అతడిని వదిలిపెట్టలేదు. తమ మాట విననందుకు కరెంట్ షాక్ ఇచ్చారు. అతడి వద్ద ఉన్న డబ్బులు, విలువైన వస్తువులు అన్నీ దోచుకున్నారు. ఆ తర్వాత పారిపోయారు. చివరకు ప్రాణాలతో బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ గే సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన వివరాల ప్రకారం విశాల్ అనే ఓ నిందితుడుని తొలుత పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
First published: September 15, 2019, 8:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading