బొల్లారంలో బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్... షాకింగ్ విజువల్స్

పెద్ద శబ్ధంతో బాంబులా సిలిండర్ పేలుడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు.

news18-telugu
Updated: October 16, 2019, 11:13 AM IST
బొల్లారంలో బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్... షాకింగ్ విజువల్స్
పెద్ద శబ్ధంతో బాంబులా సిలిండర్ పేలుడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు.
  • Share this:
హైదరాబాద్ శివారు ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్ధంతో బాంబులా సిలిండర్ పేలుడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలిన సమయంలో పెద్ద శబ్దంతో ఇంట్లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుందా... లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: October 16, 2019, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading