గన్నవరంలో యువకుడి ఆత్మహత్య... సంబంధం లేదన్న ఎస్ఐ

డిగ్రీ విద్యార్థి మురళిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అతడి ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదని గన్నవరం ఎస్ఐ నారాయణమ్మ తెలిపారు.

news18-telugu
Updated: November 18, 2019, 11:00 PM IST
గన్నవరంలో యువకుడి ఆత్మహత్య... సంబంధం లేదన్న ఎస్ఐ
ఆత్మహత్యకు పాల్పడిన మురళీ(ఫైల్ ఫోటో)
  • Share this:
గన్నవరం సమీపంలోని కోనాయిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మురళి అనే విద్యార్థి ఆత్మహత్యపై గన్నవరం ఎస్ఐ నారాయణమ్మ వివరణ ఇచ్చారు. డిగ్రీ విద్యార్థి మురళిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అతడి ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలిపారు. మురళి ఓవర్‌ స్పీడ్‌తో రాంగ్‌ రూట్‌లో బైక్‌ నడపడంతోనే స్టేషన్‌కు పిలిచి మాట్లాడనని... అయితే అతడు దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదే విషయాన్ని సీఐ దృష్టికి కూడా తీసుకెళ్ళానని ఆమె చెప్పారు. చదువుకుంటూ టీ దుకాణం నడిపే మురళి తమకు ముందు నుంచి పరిచయస్తుడేనని ఎస్ఐ నారాయణమ్మ తెలిపారు.

ఈ కారణంగానే అతడిని స్టేషన్‌కు పిలిచాం కానీ, ఎటువంటి వార్నింగ్‌ ఇవ్వలేదని ఎస్‌ఐ నారాయణమ్మ స్పష్టం చేశారు. తన భర్త కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ, బెదిరించడం కానీ చేయలేదని ఆమె తెలిపారు. మరోవైపు... ఎస్‌ఐ నారాయణమ్మ వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డిగ్రీ విద్యార్థి మురళి తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది.

First published: November 18, 2019, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading