హోమ్ /వార్తలు /క్రైమ్ /

తగ్గేదేలే..అచ్చు పుష్ప సినిమానే..అధికారుల మైండ్ బ్లాక్..వీళ్ల మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

తగ్గేదేలే..అచ్చు పుష్ప సినిమానే..అధికారుల మైండ్ బ్లాక్..వీళ్ల మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

బొలెరో పైకప్పులో గంజాయి

బొలెరో పైకప్పులో గంజాయి

సాధారణంగా మనం సినిమాలను కాలక్షేపం కోసం చూస్తుంటాం. కానీ కొంతమంది అదే సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అయితే ఆ ఇన్స్పిరేషన్ నలుగురికి ఉపయోగపడేది అయితే మంచిదే, కానీ గంజాయి తరలింపు, దొంగతనాలు, మర్డర్లు చేయడానికి సినిమాల సీన్ లను నిజ జీవితంలో రిపీట్ చేస్తున్నారు. ఇటీవల దృశ్యం సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని హత్యలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు పుష్ప సినిమా వంతు అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంజాయి స్మగ్లర్ పాత్రలో నటించాడు. పోలీసుల కళ్లు గప్పి కలపను అడవి దాటించడం అంటే మామూలు కాదు. కానీ అల్లు అర్జున్ అలవోకగా వాహనాల్లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి దుంగలను అనుకున్న స్థావరానికి చేరవేస్తాడు. కానీ అది సినిమాలో కాబట్టి వర్కౌట్ అయింది. బయట అలాంటి సీన్ లు జరుగుతాయని అస్సలు ఊహించలేం. కానీ తాజాగా ఏపీలో అచ్చు పుష్ప సినిమా సీన్ రిపీట్ అయింది. గంజాయి తరలించడానికి వారు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Paritala Sunita: ఏపీలో టెన్షన్..టెన్షన్..పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల సునీత ఆందోళన..పరిస్థితి ఉద్రిక్తం

బొలెరో టాప్ పై అర..మాస్టర్ ప్లాన్

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కించు మండలంలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఓ బొలెరో వాహనం కనిపించింది. అయితే అన్ని వాహనాలకు ఉన్నట్టే బొలెరో టాప్ పై లగేజ్ పెట్టుకునేందుకు వీలుగా స్టాండ్ ఉంది. ఇక వాహనంలోని ఇద్దరినీ ప్రశ్నించగా పోలీసులకు అనుమానం వచ్చింది. దీనితో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వాహనంపై పై ఉన్న ప్రత్యేక అరను పోలీసులు గుర్తించారు. వాహనం టాప్ లేపి చూస్తే ఆ అరలో ఉన్న గంజాయిని చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 కిలోల గంజాయిని ప్రత్యేక అర ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. ఇక ఈ ఘటన చూసిన SEB అధికారులకు ఆశ్చర్యపోవడం వంతైంది. ఈ ఘటనలో రమేష్, మహేశ్వర్ ను ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వాహనాన్ని పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న గంజాయి తరలింపు ఆగడం లేదు. యువత మత్తు కోసం తమ జీవితాన్నే చిత్తూ చేసుకుంటున్నారు. గంజాయికి అలవాటుపడి పెద్ద మొత్తంలో ఖరీదు చేసి తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంజాయి పట్టుబడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.

First published:

Tags: Ap, AP News, Crime news, Ganja smuggling

ఉత్తమ కథలు