GANGSTER WHO SHOT DEAD A STUDENT AT A WEDDING IN HARYANA SNR
Video Viral:హర్యానాలో పెళ్లికి వెళ్లిన కుర్రాడ్ని కాల్చి చంపారు..ఎందుకో మీరే చూడండి
(పెళ్లికొచ్చిన గెస్ట్‌ని కాల్చి చంపాడు)
Haryana:పెళ్లి వేడుక చూద్దామని వెళ్లిన స్టూడెంట్ తుపాకి తూటాకి బలయ్యాడు. అదేంటి పెళ్లిలో ఓ యువకుడ్ని తుపాకితో కాల్చి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది..ఎందుకొచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మర్డర్‌కి సంబంధించిన వీడియో చూస్తే క్లియర్‌గా అర్ధమవుతుంది. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
హర్యానా(Haryana)లో దారుణం జరిగింది. ఓ పెళ్లి వేడుకకు స్నేహితుడితో వెళ్లిన స్టూడెంట్‌ని గ్యాంగ్‌స్టర్ (Gangster)తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన పానిపట్ జిల్లాలో జరిగింది. పానిపట్‌లోని ఆజాద్‌నగర్‌లో స్టూడెంట్ చిరాగ్ (Chirag)తన ఫ్రెండ్ సుమిత్(Sumit)తో కలిసి కాలనీలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లాడు. ఆ పెళ్లి వేడుక గ్యాంగ్‌స్టర్ (Gangster) దల్జీత్ (Daljeet) అలియాస్ జీతా (గ్యాంగ్‌స్టర్ దల్జీత్) మేనల్లుడిది కావడంతో అతను కూడా అక్కడే ఉండి మందు పార్టీ చేసుకున్నాడు. ఓ గదిలో గ్యాంగ్‌స్టర్ మద్యం సేవిస్తుండగా చిరాగ్ అలియాస్ గౌరవ్‌శర్మ అనే కుర్రాడు ఆ గదిలోకి వెళ్లాడు. తెలియక వెళ్లిన చిరాగా్ని గ్యాంగ్‌స్టర్ అక్కడే ఉండమని ఆదేశించాడు. గదిలో కాసేపు కూర్చున్న తర్వాత చిరాగ్ ఇంటికి వెళ్తాననిగదిలోంచి బయటకు వెళ్లేందుకు సోఫాలోంచి లెగవగానే గ్యాంగ్‌స్టర్ దల్జీత్ కోపంతో జేబులోంచి తుపాకీ (Gun)తీసి కాల్చాడు. ఓ రౌడీషీటర్ స్టూడెంట్‌ని పెళ్లి (Wedding)వేడుక జరుగుతున్న చోట హత్య (Murder)చేయడం గదిలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. దర్జీత్ తుపాకీతో కాల్చడంతో తుపాకీలోని బుల్లెట్ నేరుగా చిరాగ్ గుండెలోకి దూసుకుపోయింది. పెళ్లి జరుగుతున్న చోట హత్య జరగడం చూసి పెళ్లి వాళ్లతో పాటు శుభకార్యం చూసేందుకు వచ్చిన వాళ్లు షాక్ అయ్యారు.
పెళ్లి వేడుకలో దారుణం..
గ్యాంగ్‌స్టర్ దర్జీత్ 17ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపుతున్న దృశ్యాలు ఆ గదిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరాగ్ గ్యాంగ్‌స్టర్ తుపాకీతో కాల్చడం వల్లే చనిపోయినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. జింద్‌లోని పిల్లుఖేడాలో నివాసముంటున్న గ్యాంగ్‌స్టర్ దల్జీత్ అలియాస్ మేనల్లుడి వివాహం జరగుతుండటంతో అక్కడికి వచ్చి ఈ నేరానికి పాల్పడినట్లుగా తేలింది. రౌడీ షీటర్ తన మనుషులో గదిలో మద్యం తాగుతుండగా చిరాగ్ వెళ్లాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తి గదిలోకి వచ్చాడనే కోపంతో గ్యాంగ్‌స్టర్ తుపాకితో కాల్చాడు. బుల్లెట్ తగిలిన చిరాగ్‌ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికి ప్రయోజనం లేకపోయింది. డాక్టర్లు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
(స్టూడెంట్‌ని కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్)
స్టూడెంట్‌ని కాల్చిన గ్యాంగ్ స్టర్..
ఈ వీడియో ఆధారంగా పోలీసులు గ్యాంగ్‌స్టర్ దల్జీత్ అలియాస్ జీతా (గ్యాంగ్‌స్టర్ దల్జీత్)పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. త్వరలోనే ఈ హంతకుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.