Vikas Dubey Arrested: వికాస్ గ్యాంగ్‌లో ఇప్పటికే ముగ్గురిని యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిన్న వికాస్ దుబే అమర్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా.. ఇవాళ మరో ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు.
యూపీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే అరెస్టయ్యాడు. 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కిరాతక రౌడీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని యూపీ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన తర్వాత.. వికాస్ దుబే అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచీ తప్పించుకు తిరుగుతున్నాడు. ఐతే వికాస్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో.. అతడిలో భయం మొదలయింది. తనను కూడా ఎన్కౌంటర్ చేస్తారన్న భయంతో.. పథకం ప్రకారం లొంగిపోయినట్లు తెలుస్తోంది.
పోలీసులకు ఇది గొప్ప విజయం. వికాస్ దుబే కిరాతక హంతకుడు. మధ్యప్రదేశ్ పోలీసులంతా అప్రమత్తంగా ఉన్నారు. ఉజ్జయిని మహకాళి ఆలయంలో అతడిని అరెస్ట్ చేశాం. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించాం.
— నరోత్తం మిశ్రా, మధ్యప్రదేశ్ మంత్రి
ఇక వికాస్ గ్యాంగ్‌లో ఇప్పటికే ముగ్గురిని యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిన్న వికాస్ దుబే అమర్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా.. ఇవాళ మరో ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజే.. మరో ఇద్దరు అనుచరులను పోలీసులు కాల్చిచంపారు. ఎట్వా ప్రాంతంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా బహువా దుబేపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు మరణించాడు. అటు మరో అనచరుడు ప్రభాత్ మిశ్రా కూడా ఇతే తరహాలో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై పోలీసులు కాల్పుడు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వికాస్ దూబెను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి పైకప్పు నుంచి పోలీసులపైకి దాడి చేశారు.
ఐతే కొందరు పోలీసులు వికాస్ దూబెకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీని బుధవారం యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.