బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ రేప్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణపై ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహానాపూర్లో చోటేచేసుకుంది. ఈ వివరాలును బాధితురాలు గురువారం మీడియాకు వెల్లడించింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళ తనను ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించారు. నవంబర్ 30వ తేదీన కాలినడకన మదన్పూర్ వెళ్తున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు వచ్చి కారులో బలవంతంగా ఎత్తుకెళ్లారని.. అక్కడి సమీంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది.
తాను జలాలాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడి ఇన్స్పెక్టర్.. అతని గదిలోకి రమ్మని చెప్పి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటనపై బుధవారం ఆమె బరేలీ ఏడీజీ అవినాష్ చంద్రను కలిసి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకోంది.
అయితే ఆ మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించినటటు ఏడీజీ అవినాష్ చంద్ర తెలిపారు. ఇక, ఓ మహిళ పోలీసు అధికారి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం రేపింది.
Published by:Sumanth Kanukula
First published:December 25, 2020, 07:15 IST