గుంటూరులో గ్యాంగ్ రేప్.. యువతి మృతి

తెలిసిన యువకులే పార్టీలో మద్యం తాగి.. ఆమెపై రేప్ చేసినట్లు తెలుస్తోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది.


Updated: January 14, 2020, 8:46 PM IST
గుంటూరులో గ్యాంగ్ రేప్.. యువతి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశా చట్టం అమల్లోకి తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై కొందరు దుండగులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. మాచర్ల మండలం బీకేవీ చెంచుకాలనీలో డిసెంబరు 24న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికి వచ్చిన 22 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తెలిసిన వ్యక్తులే పార్టీలో మద్యం తాగి.. ఆమెపై రేప్ చేసినట్లు తెలుస్తోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. మృతురాలి స్వస్థలం వెల్దుర్తి మండలం గుడిపాడుచెరువని పోలీసులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>