మళ్లీ నలుగురు మృగాళ్లే...యువతిపై గ్యాంగ్ రేప్ చేసి..వీడియో తీసి బ్లాక్ మెయిల్..

అదే సమయంలో ఉన్న ముగ్గురు అగంతకులు విమల్ తో కలిసి, బాధితురాలిని ఒక పాడుబడిన బంగళాలోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు. అనంతరం వీడియో తీసి ఆమెను వేధించడం ప్రారంభించారు.

news18-telugu
Updated: December 14, 2019, 5:37 PM IST
మళ్లీ నలుగురు మృగాళ్లే...యువతిపై గ్యాంగ్ రేప్ చేసి..వీడియో తీసి బ్లాక్ మెయిల్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
యువతిని నలుగురు యువకులు లైంగిక దాడి చేసి, ఆ ఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాట్నాకు చెందిన బాధితురాలు విమల (పేరుమార్పు)ను నిందితులు కమలేష్ (పేరుమార్పు) తమ ఇంటికి సమీపంలో నివసిస్తుండేవాడు. ఈ క్రమంలో గత నెల విమల తన కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా, కమేలేష్ ఆమెపై కన్నేశాడు. రోజూ ఆమె వచ్చే మార్గంలో మాటు వేసిన కమలేష్ పథకం పన్నాడు. ఒక రోజు ఆమె ఇంటికి వస్తుండగా, ఇంటివద్ద డ్రాప్ చేస్తానని, కారు ఎక్కమని కోరాడు. అందుకు విమల సున్నితంగా తిరస్కరించినప్పటికీ, అతను మాత్రం బతిమిలాడి, చివరకు కారులో ఎక్కించుకున్నాడు. కొంచం దూరం వెళ్లిన తర్వాత షార్ట్ కట్‌లో వెళ్తామని చెప్పి కారును ఒక నిర్మానుష్య ప్రాంతంలో నిలిపాడు. అదే సమయంలో ఉన్న ముగ్గురు అగంతకులు విమల్ తో కలిసి, బాధితురాలిని ఒక పాడుబడిన బంగళాలోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు. అనంతరం వీడియో తీసి ఆమెను వేధించడం ప్రారంభించారు.

గుట్టు రట్టు చేస్తే వీడియో లీక్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేయడం చేశారు. అయితే బ్లాక్ మెయిల్ వేధింపులు అధికం కావడంతో యువతి, పాట్నాలోని సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఫిర్యాదు అందుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకోగా, విచారణ కొనసాగుతోంది.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>