గుంటూరు జిల్లాలో దారుణం.. మహిళను వెంటాడి గ్యాంగ్ రేప్

మంగళగిరి మండలం చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను వెంబడించి కిడ్నాప్ చేసి.. రేప్ చేసినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 17, 2020, 10:22 PM IST
గుంటూరు జిల్లాలో దారుణం.. మహిళను వెంటాడి గ్యాంగ్ రేప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఏపీలో దిశ చట్టం తెచ్చినా మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలం చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లికి చెందిన వివాహితను ముగ్గురు దుండగులు వెంబడించి కిడ్నాప్ చేసి.. రేప్ చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి కాపాడుకునేందుకు సదరు మహిళ కొంతదూరం పాటు నగ్నంగా పరిగెత్తినట్లు సమాచారం. యూనివర్సిటీ సర్టిఫికెట్ల విషయంలో ముగ్గురు యువకులతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను నమ్మించి మోసం చేశారు కామాంధులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు చైతన్య, ఆశీర్వాదం, నాగేశ్వర్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు