మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. సంగారెడ్డి అనాథాశ్రమంలో ఘోరం

ఓ అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలిపై ఆశ్రమ నిర్వాహకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మత్తు మందు ఇచ్చి ఈ ఘోరానికి ఒడిగట్టారు.

news18-telugu
Updated: August 13, 2020, 11:48 AM IST
మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. సంగారెడ్డి అనాథాశ్రమంలో ఘోరం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనాథ పిల్లలను చేరదీశామనే పేరుతో వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. బయటకు సేవ చేస్తున్నామని చెబుతూ లోపల లైంగిక దాడులకు తెగబడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఓ అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలిపై ఆశ్రమ నిర్వాహకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మత్తు మందు ఇచ్చి ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఐతే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఆశ్రమంలో తనిఖీలు చేశారు. ఆశ్రమ నిర్వాహకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆశ్రమ నిర్వాహకులతో పాటు వార్డెన్‌ను కూడా అదుపులోకి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆశ్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading