వివాహితపై గ్యాంగ్ రేప్.. భర్తను బంధించి అఘాయిత్యం..

ఘటన జరిగిన రోజు రాత్రి భార్యాభర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. ఆ ఫాంహౌజ్ యజమానుల మనుషులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారి స్వగ్రామం నాగర్‌కర్నూలుకు పంపించేశారు.

news18-telugu
Updated: September 27, 2019, 7:39 AM IST
వివాహితపై గ్యాంగ్ రేప్.. భర్తను బంధించి అఘాయిత్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ పరిధిలో దారుణం జరిగింది. ఫాంహౌజ్‌లో పనిచేస్తున్న ఓ వివాహితపై.. అక్కడి యజమానులు అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం నలుగురు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు సమాచారం. భర్తను పక్క గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుపడ్డారు. అయితే స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వరం మండలం హర్షగూడలో ఉన్న ఓ ఫాంహౌజ్‌లో..చందు,అతని భార్య పనిచేస్తున్నారు. ఇటీవల ఏదో విషయమై చందుకి,ఫాంహౌజ్ యజమానులైన రంగారెడ్డి,ప్రతాప్‌రెడ్డిలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చందుపై ఆవేశంతో రగిలిపోయిన ఆ ఇద్దరు.. భార్యాభర్తలను ఓ గదిలో బంధించారు. అనంతరం చందు భార్యను మరో గదిలోకి లాక్కెళ్లి.. అత్యాచారం చేశారు. మరో ఇద్దరు స్నేహితులను రప్పించి.. వాళ్లతోనూ అత్యాచారం చేయించారు. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి భార్యాభర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. ఆ ఫాంహౌజ్ యజమానుల మనుషులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారి స్వగ్రామం నాగర్‌కర్నూలుకు పంపించేశారు.అయితే గురువారం తిరిగి హర్షగూడకు వచ్చిన భార్యాభర్తలు.. గ్రామస్తుల సహకారంతో పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading