Home /News /crime /

GANG RAPE HELD BY 6 MINORS IN A MANGO CROP IN TELANGANA DISTRICT NK

యువతిపై గ్యాంగ్ రేప్... ఆరుగురు మైనర్ల నిర్వాకం...

యువతిపై గ్యాంగ్ రేప్ (gang rape on bengali actress)

యువతిపై గ్యాంగ్ రేప్ (gang rape on bengali actress)

Telangana : ఓవైపు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే... దారుణాలు మాత్రం ఆగట్లేదు. మైనర్లే అత్యాచారాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం.

    Telangana : ఓ మామిడితోటలో 24 ఏళ్ల యువతిపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన ఘటన తెలంగాణ... మహబూబాబాద్ జిల్లా... ఆమనగల్ ఊరు చివర్లోని బలరామ్ తండా దగ్గర్లో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ యువతికి... ఆమనగల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. వాళ్ల పరిచయం క్రమంగా స్నేహం లాగా మారింది. ఈ రోజుల్లో స్నేహం ఏర్పడిన తర్వాత ఫోన్లలో మాట్లాడుకోవడం మామూలే కదా అని ఆ యువతి కూడా అతనితో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఫోన్‌లో మాట్లాడేది. తాజాగా ఆమె తాను మానుకోటకు వస్తున్నాననీ, బంధువుల ఇంటికి వెళ్లేందుకు తనకు సాయం చెయ్యాలని కోరింది. సరే అన్న అతడు... ఒక్కడే రాకుండా... తనతోపాటూ... ఇద్దరు మైనర్ యువకుల్ని వెంటపెట్టుకొని ఆటోలో వచ్చాడు. అతన్ని నమ్మిన ఆమె... ఆటో ఎక్కింది. ఆటోను అమనగల్ దగ్గర్లోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. అప్పటికే చీకటి పడుతోంది. ఇదేం రూటు... ఆటో ఇటెందుకు తీసుకెళ్తున్నావని ఆమె అడిగితే... అడ్డ రోడ్డు అని చెప్పాడు.

    మామిడి తోటలోకి ఆటోను తీసుకెళ్లగానే... మరో ముగ్గురు మైనర్లు పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరకు వచ్చారు. దాంతో ఆమెకు బాగా భయం వేసింది. గట్టిగా కేకలు వెయ్యడం మొదలుపెట్టింది. దాంతో ఆమె నోరు మూసేసి ఆరుగురూ బలవంతంగా పారిపోనివ్వకుండా పట్టుకున్నారు. ఈ పెనుగులాటలో ఆమె కాసేపు గింజుకొని... స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను ఆరుగురూ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. దాదాపు రెండు గంటలపాటూ ఈ దారుణం కొనసాగింది.

    ఐతే... తోట వైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులకు... ఏవో చీకటి నీడలు కనిపించాయి. అక్కడేదో తంతు జరుగుతోందని అనుకుంటూ... పోలీసులకు కాల్ చేశారు. అలర్టైన పోలీసులు హడావుడిగా తోటలోకి వెళ్లారు. దుర్మార్గుల దుశ్చర్యను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ముగ్గురు మైనర్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే వెంటపడి పట్టుకున్నారు. ఆరుగుర్నీ అదుపులోకి తీసుకొని... యువతిని మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదీ విషయం. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. వ్యక్తులు ఎంత తెలిసిన వాళ్లైనా... అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gang rape, RAPE, Telangana News, Telangana updates

    తదుపరి వార్తలు