హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. మహిళపై వంతుల వారిగా సాముహిక అత్యాచారం..

Shocking: ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. మహిళపై వంతుల వారిగా సాముహిక అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UP Crime news: ఉత్తర ప్రదేశ్ లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఇంటి బయట కూర్చున్న ఒక మహిళ పట్ల కొందరు నీచంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా ఇంటి లోపలికి ఈడ్చుకేళ్లారు.

Woman Gangraped In UP's Shahjahanpur: ప్రస్తుతం మహిళలపై ప్రతిరోజు అఘాత్యాలు జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు.. దిశ, నిర్భయ వంటి ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన కొందరు నీచులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళను ఐదుగురు కామాంధులు ఇంటిలోపలికి లాక్కెళ్లారు. ఆ తర్వాత.. ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో మిగతా వారు ఘటనను తమ సెల్ ఫోన్ లో బంధించారు. ఈ ఘటన ఏప్రిల్ 22 న జరిగినట్లు బాధితురాలు తెలిపింది. ఘటన తర్వాత .. బాధితురాలిని నిందితులు బెదిరించారు.

పోలీసులకు చెబితే వీడియో వైరల్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధిత యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో మరోసారి నిందితులు వేధింపులకు పాల్పడటంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. కాగా, ఈ దారుణానికి చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకొవడానికి  ప్రత్యేక  పోలీస్ టీమ్ లను రంగంలోనికి దింపారు.

Man arrested for flashing genitals at women..

నేరాలను అరికట్టాల్సిన పోలీసులే తప్పుడు పనులు చేస్తున్నారు. కొందరు పోలీసులు మహిళలు, యువతుల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు చేస్తున్న తప్పులకు మిగతా డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు వస్తుంది. కొందరు పోలీసులకు తమ అధికారాన్నిఅడ్డంపెట్టుకుని మహిళలను, అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు. కొంత మంది మరీ దిగజారీ తమ కోరికను తీరిస్తేనే.. వారి సమస్యను పరిష్కరిస్తామంటూ నీచానికి దిగుతున్నారు. ఈ కోవకు చెందిన అనేక ఘటనలు ప్రస్తుతం వార్తలలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సంఘటన కర్ణాటకలో జరిగింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో ఒక హోంగార్డు చేసిన ఘనకార్యం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపింది. మంగళూరుకు చెందిన సుజిత్ శెట్టి (26) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతగాడు... మద్యం మత్తులో మసీదుకు వెళ్లాడు. అక్కడ మహిళలు నమాజ్ చేసుకొవడానికి వచ్చారు. అతను.. మహిళల దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత.. తన పురుషాంగాన్ని బైటకు తీసి మహిళలకు చూపిస్తు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఇతను చేసిన పనికి అక్కడి మహిళలు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను గతంలో కూడా మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడని పలు అభియోగాలు ఉన్నాయి. కొన్ని సార్లు తనతో సెల్ఫీ దిగాలంటూ బాలికలను, యువతులను వేధించేవాడు. ఫోటో నెపంతో వారి ప్రైవేటు పార్ట్ లను తడుముకుంటూ పైశాచీకానందం పొందేవాడు. ఈ ఘటనతో మరోసారి పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళలు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ ఎదుట వచ్చి డిమాండ్ చేస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Gang rape, Harassment, Rape on women, Uttar pradesh

ఉత్తమ కథలు